ముంచుకొస్తున్న వార్ధా, చెన్నై దిశగా..: 22 ఏళ్ల తర్వాత మళ్లీ.. నౌకలు, ఆహారం సిద్ధం
బంగాళాఖాతంలో ఏర్పడిన వార్దా తుపాను క్రమంగా తన దిశను మార్చుకుంటోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి దిశను ఆనుకుని కేంద్రీకృతమై ఉంది.
విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడిన వార్దా తుపాను క్రమంగా తన దిశను మార్చుకుంటోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి దిశను ఆనుకుని కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు నైరుతి దిశగా 340 కి.మీ., నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 390 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
రేపు మధ్యాహ్నం ఇది చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశముంది. వార్దా వల్ల కోస్తాంధ్రతో పాటు చెన్నై వరకు 36 గంటల పాటు వర్ష సూచన ఉంది. తీరం వెంబటి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను తీరం దాటే సమయంలో ఇది 100 కి.మీ. వేగం ఉండొచ్చు.
ఇరవై సెంటీమీటర్ల వర్షం పడనుంది. కృష్ణపట్నం పోర్టులో ఆరో నెంబర్, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముదంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రకాశం, నెల్లూరులలో భారీ వర్షాలు కురవనున్నాయి.

తూర్పు నౌకాదళం అప్రమత్తం
వార్దా తుఫాను నేపథ్యంలో తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. చెన్నై నౌకాదల స్థావరంలో నౌకలు ఏర్పాటు చేశారు. ఐదువేల మందికి ఆహారం సిద్ధంగా ఉంచారు. 30 బృందాలుగా గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు. నేవీ హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. ఆహార పదార్థాలు అందించేందుకు రాజాలి, డేగా ఎయిర్ పోర్టులలో ఏర్పాటు చేశారు.
నెల్లూరులో ఎన్డీఆర్ఎఫ్
వర్ద తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు నెల్లూరు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. నగరం నుంచి సూళ్లూరుపేట నియోజకవర్గానికి రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపారు. మరో బృందాన్ని నెల్లూరులో సిద్దంగా ఉంచారు.
నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ, శ్రీహరికోట ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. తమిళనాడు పరిధిలోని తడ సముద్రతీర ప్రాంత మత్స్యకారులు మరింత అప్రమత్తతో వ్యవహరించాలంటూ వారిని హెచ్చరించారు. ప్రత్యేక భద్రతా సిబ్బందిని నియమించారు.
కాగా, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తీరం వైపు తుఫాను ముంచుకొస్తున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు.
వార్దా తుఫాను నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. తీర ప్రాంతాలైన తిరువల్లూరు, కాంచీపురం, చెన్నై, విల్లుపురంలో రేపు విద్యా, వాణిజ్య సంస్థలు తెరుచుకోవు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తమిళనాడు సీఎం పన్నీరు సెర్వం అధికారులను ఆదేశించారు.
22 ఏళ్ల తర్వాత చెన్నైవాళ్లు మళ్లీ వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడాన్ని, భారీ వర్షాన్ని చూడనున్నట్లు చెబుతున్నారు. 1994లో చివరిసారి వచ్చిందని అంటున్నారు. అప్పుడు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications