బడ్జెట్: బాబు సహనం పరీక్షించొద్దని వర్ల వార్నింగ్, మూడు.. జేసీ సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహనాన్ని కేంద్రం పరీక్షిస్తోందని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య గురువారం అన్నారు. అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్ పైన వర్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Recommended Video

చంద్రబాబు ఇప్పటికీ సహనంతో వ్యవహరించారని ఆయన చెప్పారు. ఆయన ఓర్పును పరీక్షించవద్దని హెచ్చరికగా మాట్లాడారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

బడ్జెట్‌పై హరిబాబు
కేంద్ర బడ్జెట్ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చే విధంగా ఉందని బీజేపీ విశాఖపట్నం ఎంపీ హరిబాబు అన్నారు. ఏపీకి నష్టం జరగలేదన్నారు. విభజన చట్టంలోని పేర్కొన్న అయిదు సంస్థలు రావాల్సి ఉందని, సెంట్రల్, గిరిజన వర్సిటీలకు నిధులు కేటాయించారని చెప్పారు.

రైల్వే జోన్‌పై
విభజన చట్టంలో రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలపైనే అరుణ్ జైట్లీ ప్రస్తావించారని హరిబాబు చెప్పారు. అధికారుల నివేదికతో సంబంధం లేకుండా రైల్వే జోన్‌పై రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

చెప్పుకోవడానికి ఏమీ లేదు
కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చిందని కాంగ్రెస్ ఎంపీ టీ సుబ్బరామి రెడ్డి అన్నారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రస్థావన, పునర్విభజన చట్టంలోని అంశాలను ప్రస్థావించకపోవటం అన్యాయమన్నారు. ప్రత్యేకంగా చెప్పుకోవటానికి ఏమీలేని బడ్జెట్లో మిగిలేది అసంతృప్తే అన్నారు.

మూడు నామాలు, బాబు స్థాయి మరిచి తిరిగినా
బడ్జెట్‌లో ఏపీకి మూడు నామాలు పెట్టినట్టుందని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జైట్లీ బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిని మరిచి కేంద్రం చుట్టూ తిరిగినా ప్రయోజన లేకుండా పోయిందని వాపోయారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications