‘జగన్ వీధి రౌడీ! ఆయనది బెజవాడ బ్లేడ్ బ్యాచ్, కాళకేయ ముఠా’
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతల విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది.
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతల విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. తాజగా టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బెజవాడ బ్లేడ్ బ్యాచ్‌కి, జగన్ బ్యాచ్‌కి తేడా లేదని వర్ల రామయ్య విమర్శించారు. జగన్ వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టాలని రామయ్య డిమాండ్ చేశారు.

ఇది ఇలా ఉండగా, రాయలసీమలో అనేక మందిని చంపిన నీచమైన చరిత్ర జగన్ కుటుంబానిదని మరో టీడీపీ నేత అనురాధ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ముఠా కాలకేయులను మించిపోయిందని అన్నారు.
జగన్మోహన్ రెడ్డిపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని అనురాధ డిమాండ్ చేశారు. పరిటాల రవి, సూరి, మొద్దు శ్రీనును చంపించారని ఆరోపించారు. జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అనురాధ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications