నిమ్మగడ్డపై కామెంట్లు తగదు.. వైసీపీ నేతలపై వర్ల రామయ్య విసుర్లు
ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ మాటల యుద్ధం జరుగుతోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య కౌంటర్ అటాక్ నడుస్తోంది. ఎస్ఈసీకి అనుకూలంగా టీడీపీ, వ్యతిరేకంగా వైసీపీ నేతల మాట్లాడుతున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై వైసీపీ మంత్రులు, నేతలు చేస్తోన్న కామెంట్లను టీడీపీ నేత వర్ల రామయ్య ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
నిమ్మగడ్డ రమేశ్‌పై వైసీపీ ప్రభుత్వం కత్తి కట్టిందని వర్ల రామయ్య అన్నారు. మంత్రులు అమానుషంగా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. నిమ్మగడ్డను వ్యక్తిగతంగా కామెంట్ చేయడం, బెదిరించడం సరికాదన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగకూడదని ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నట్టుగా ఉందని అన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం అమలు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. బలవంతంగా ఏకగ్రీవాలను చేయడం ప్రభుత్వ లక్ష్యమా అని ప్రశ్నించారు.

ఇవాళ ఎస్ఈసీ రాయలసీమలో పర్యటించారు. కడప టూర్ సందర్భంగా దివంగత వైఎస్ఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన ఆశీస్సులతోనే తాను ఈ స్థానంలో ఉన్నానని చెప్పారు. దీంతో వైసీపీ నేతల విమర్శలకు తనదైన శైలిలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెక్ పెట్టారని అర్థమవుతోంది. వైఎస్ఆర్ పేరు జపించి.. నేతల నుంచి కొంత విమర్శలను తగ్గించుకోగలిగారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.












Click it and Unblock the Notifications