వర్మ 'వంగవీటి' సినిమా: 'గాయం' సినిమాలో రంగా క్యారెక్టర్ ఇలా...
విజయవాడ: తాజాగా రామ్ గోపాల్ వర్మ వంగవీటి అనే సినిమాను తీస్తున్నారు. రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమం చెలరేగుతున్న సమయంలో ఆయన ఆ సినిమాను మార్కెట్ కూడా చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం జనవరి 31వ తేదీన నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభలో వంగవీటి రంగా అమర్ రహే అంటూ నినాదాలు వినిపించాయి.
కాపు ఐక్య గర్జన ఫ్లెక్సీలు, పోస్టర్ల మీద కూడా ఆయన చిత్రం ప్రముఖంగా ఉంది. కాపుల నేతగా వంగవీటి రంగా పేరు సంపాదించుకున్నారు. వంగవీటి రంగా విషయంలో రామ్ గోపాల్ వర్మ ఆయన కుమారుడు వంగవీటి రాధాతో ఇటీవల వివాదానికి కూడా దిగారు.
Also Read: వర్మ ‘వంగవీటి రంగా' ఇతనే(ఫొటోలు)
అయితే, గాయం సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్‌ను వంగవీటి రంగాను దృష్టిలో పెట్టుకునే రామ్ గోపాల్ వర్మ తీర్చిదిద్దారని అంటారు. ఆ సినిమా 1993లో వచ్చింది. విజయవాడ రాజకీయ మాఫియాను తెరకెక్కించిన సినిమా. వంగవీటి రంగా సోదరుడు వంగవీటి రాధాకృష్ణ ప్రత్యర్థుల చేతుల్లో హతం కావడం, అనివార్యంగా ఆయన పాత్రను వంగవీటి రంగా పోషించాల్సి రావడాన్ని ఇతివృత్తంగా గ్రహించే గాయం కథను రామ్ గోపాల్ వర్మ రూపొందించారని అంటారు.

దుర్గ (జగపతిబాబు), అనిత (రేవతి) ప్రేమాయణాన్ని వాస్తవ సంఘటనల నుంచే తీసుకున్నారా, లేదా అనేది కచ్చితంగా చెప్పలేం గానీ సినిమాలో మోహనకృష్ణ (చరణ్ రాజ్) స్థానిక ఎమ్మెల్యే గురునారాయణ (కోట శ్రీనివాస రావు) మనుషుల చేతిలో హతం కావడం, తన సోదరుడిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సి రావడం మాత్రమే కాకుండా తన సోదరుడిని నమ్ముకుని ఉన్నవాళ్లకు అండగా ఉండాల్సి రావడం అనే అనివార్యమైన పరిస్థితుల్లో దుర్గ పొలిటికల్ మాఫియాలో కింగ్‌గా మారినట్లు రామ్ గోపాల్ వర్మ చూపించారు.
పోతే, ఆ తర్వాత దుర్గ హైదరాబాద్ రావడం, హైదరాబాదులో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించినవారిని ఎదుర్కోవడం అనే సంఘటనలు దానికి వాస్తవదూరంగా ఉన్నాయి. మొత్తం మీద, రామ్ గోపాల్ వర్మకు రంగా మీద మంచి అవగాహనే ఉందని అనుకోవచ్చు. ఏమైనా, కాపు ఉద్యమం ఊపందుకున్న సమయంలో దాన్ని రామ్ గోపాల్ వర్మ తెర మీదికి తెచ్చారు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications