పిఠాపురంలో నాగబాబు ఎంట్రీ వేళ వర్మ మార్క్ గేమ్..!!
పిఠాపురం కూటమి పార్టీల్లో ఏం జరుగుతోంది. డిప్యూటీ సీఎం పవన ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో పట్టు తిప్పుతోంది. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కోసం టీడీపీ నేత వర్మ 2024 ఎన్నికల్లో తన సీటు త్యాగం చేసారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ సీటు పైన హామీ దక్కింది. అయితే, పది నెలలు పూర్తయినా ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు. జనసేన సభలో నాగబాబు చేసిన కామెంట్స్ వర్మ మద్దతు దారుల కు నచ్చలేదు. తాజాగా ఎమ్మెల్సీ హోదా లో నాగబాబు పిఠాపురం వచ్చారు. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
నాగబాబు ఎంట్రీ వేళ
పిఠాపురంలో వర్మకు చెక్ పెడుతున్నారా. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ హోదాలో పిఠాపురంలో ఎంట్రీ సమయంలో టీడీపీ కేడర్ లో ఈ సందేహం మొదలైంది. నాగబాబు పిఠాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ప్రాధాన్యత లేకుండా జనసేన నేతలు వ్యవహరిస్తున్న తీరు వర్మ టీడీపీ కేడర్ కు నచ్చటం లేదు. దీంతో, పార్టీకి అనుకూలంగా కాకుండా జై వర్మ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. నాగబాబు పర్యటన సమయంలో వర్మ మద్దతు దారుల నినాదాలకు జనసేన కేడర్ కౌంటర్ గా జై జనసేన అంటూ నినాదాలు చేసారు. పిఠాపురం కేంద్రంగా రోజు రోజుకీ ముదురుతున్న ఈ వివాదం ఇప్పుడు రెండు పార్టీలకు అంతు చిక్కటం లేదు.

నాగబాబు వ్యాఖ్యలతో
జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్యలతో గ్యాప్ మరింత పెరిగింది. వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ సోదరుడుగా నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటం.. మంత్రిగానూ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించటం టీడీపీ కేడర్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. పిఠాపురంలో పవన్ గెలుపులో వర్మ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల తరువాత క్రమేణా వర్మ - జనసేన శ్రేణుల మధ్య గ్యాప్ పెరుగుతోంది. స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు ఎవరైనా పవన్ విజయం వెనుక ఉన్నామని భ్రమ పడితే అది వారి ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పైన టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ పైన తాజాగా టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. వర్మకు ప్రాధాన్యత ఇవ్వకపోవటం పైన నిలదీసి న కార్యకర్తలు.. వర్మ చెబితేనే పవన్ కు ఓటు వేసామని తేల్చి చెప్పారు.
వర్మకు మద్దతుగా
నాగబాబు పర్యటనతో వర్మ ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ స్థానికులు కోరుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు రెండు రోజుల పాటు పిఠాపురంలో పర్యటనకు వచ్చారు. నియోజకవర్గం పెత్తనం తన సోదరుడు చేతిలో పెట్టేలా పవన్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇక నుంచి పిఠాపురం బాధ్యతలు నాగబాబు చూస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతన నిర్మాణాలను నాగబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. త్వరలోనే నాగబాబు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నాగబాబు వస్తూనే నియోజకవర్గంలో రెండు పార్టీల కేడర్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో, పిఠాపురం కేంద్రంగా వర్మ లక్ష్యంగా చోటు చేసుకునే రాజకీయంగా పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications