24 గం.ల్లో మూడు..: ఏపీలో మరో రైలు ప్రమాదం.. తిరుపతిలో 2 బోగీలు పట్టాలు తప్పాయి
వరుస రైలు ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రయాణీకులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మూడు చోట్ల రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
చిత్తూరు: వరుస రైలు ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రయాణీకులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మూడు చోట్ల రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
ఏపీలో హిరాకుండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం చోటు చేసుకొని రోజు గడవమకముందే అదే రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం పట్టాలు తప్పింది. తిరుపతి రైల్వే స్టేషన్‌లో వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ ఆదివారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది.

రైలును సిద్ధం చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. రైలు ఇంజిన్ సహా రెండు బోగీలు పట్టాలు తప్పాయి. వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రైల్వే సిబ్బంది ఘటనాస్థలిలో మరమ్మతులు చేపట్టారు.
ఆదివారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వే స్టేషన్ వద్ద హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 23 మంది మృతి చెందారు.












Click it and Unblock the Notifications