వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిచ్చి వల్లనే: పుష్కర ప్రమాదంపై బాబును ఏకేసిన పద్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గోదావరి పుష్కరాల్లో జరిగిన ప్రమాదానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిందించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగిందని ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. చంద్రబాబు పిచ్చి కారణంగానే ప్రమాదం జరిగిందని ఆమె అన్నారు.

ఆ ప్రమాదానికి చంద్రబాబుదే బాధ్యత అని, చంద్రబాబుకు ఉన్న ప్రచారం యావ వల్లనే ఈ దారుణ ఘటన జరిగిందని ఆమె అన్నారు. చంద్రబాబు పూజలు చేస్తున్న సమయంలోనే లక్షల మంది బయట వేచి ఉన్నారని, ముఖ్యమంత్రి ఘాట్‌కు వచ్చేటప్పటికే జనం క్రిక్కిరిసి ఉన్నారని ఆమె చెప్పారు. ప్రభుత్వమై కావాలని భక్తులందరినీ ఒకే ఘాట్‌కు తరలించిందని అన్నారు.

భక్తులు తమంత తామే అక్కడికి వచ్చారని ఇప్పుడు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. ముఖ్యమంత్రి పూజ చేస్తున్న సమయానికి జనం పోటెత్తారని చెప్పడానికి ఇదంతా చేశారని అన్నారు. లఘు చిత్రం కోసం ఫొటోలు తీసుకోవడానికి ఇలా చేశారని కూడా ఆమె అన్నారు. ఫొటోలు బాగా రావాలనే ఆలోచనతోనే భక్తుల భద్రతను గాలికి వదిలేశారని విమర్శించారు.

భారీ జనసందోహం కనిపించే దాకా ముక్యమంత్రి పూజా కార్యక్రమం నిర్వహించారని, మూడు గంటల పాటు జనాన్ని పుష్కర ఘాట్‌కు ఆవల నిలిపేశారని చెప్పారు. ప్రచార యావతోనే ఈ ప్రాణనష్టం జరిగిందని, చంద్రబాబు పిచ్చిని ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు.

Vasireddy Padma blames Chandrababu on Rajamundry incident

తన వల్ల తప్పు జరిగినందుకు సిఎం క్షమాపణ చెప్పారా, తన వల్ల ఈ తప్పు జరిగిందని సిఎం చెప్పుకుంటే తప్పేమిటని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. చంద్రబాబు కంటతడి పెట్టారని మీడియా సలహాదారు చెబతారని, చంద్రబాబు ప్రతిదాన్నీ మేనేజ్ చేయాలని అనుకుంటారని ఆమె అన్నారు. న్యాయవిచారణకు ఆదేశించే నైతిక హక్కు చంద్రబాబుకు ఎక్కడుందని ఆమె అడిగారు.

చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారా, లేదా అని ఆమె అడిగారు. తొక్కిసలాట ఘటనపై సమగ్ర నివేదిక ప్రభుత్వ వద్ద లేకపోవడం దారుణమని ఆమె అన్నారు. తొక్కిసిలాట ఘటన బయటకు రాకుండా మీడియా గొంతు నొక్కాలని అనుకున్నారని ఆమె విమర్శిచారు తొక్కిసలాట దృశ్యాలు బయటకు రాకుండా చేశారుని జయసుధ వ్యాఖ్యానించారు

English summary
YS Jagan's YSR Congress party leader Vasireddy Padma in Puskhar Ghat accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X