రాజీ కోసం వనజాక్షిని చంద్రబాబు బెదిరించారు: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన వివరాలు, ఒప్పందాలు బయటపెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ శుక్రవారం డిమాండ్ చేశారు. ఎమ్మార్వో వనజాక్షి పైన దాడులకు పాల్పడిన వారి పైన ఇప్పటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమన్నారు.
ఎమ్మెల్యే చింతమనేని ఆదేశాల మేరకే వనజాక్షి పైన దాడి జరిగిందని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. చంద్రబాబు నేతృత్వంలో రెవెన్యూ ఉద్యోగులతో రాజీకి ప్రయత్నాలు చేయడం విడ్డూరమన్నారు. రాజీ కోసం వనజాక్షిని చంద్రబాబు బెదిరించారన్నారు.
దాడి జరిగి మూడు రోజులు అవుతున్నా ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. రాజీకి రావాలని చంద్రబాబు తహసీల్దారుకు ఫోన్ చేయడం బాధాకరమన్నారు. చంద్రబాబు బెదిరిస్తున్నారన్నారు. విదేశీ పర్యటనల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాడన్నారు.

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. గత ఏడాది పొగాకు కిలోకు రూ.174 ఉంటే ఈ ఏడాది రూ.110-117 మధ్య ఉందన్నారు. జగన్ పొగాకు రైతులను పరామర్శించి, గిట్టుబాటు ధర పెంచాలని డిమాండ్ చేసినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.
ఈ నెల 14న పొగాకు అమ్మే అన్ని ప్లాట్ ఫాంల వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తోందని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే గుంటూరు పొగాకు బోర్డును ముట్టడిస్తామని హెచ్చరించారు. పొగాకు పంటకు మద్దతు ధర లేక టంగుటూరులో రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.












Click it and Unblock the Notifications