వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ వ్యాట్ దెబ్బ!: పెట్రోల్, డీజిల్‌పై అదనపు రుసుం రూ.2 పెంపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో విక్రయించే పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు అదనంగా రూ.2 చొప్పున వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరల్ని తగ్గించినప్పటికీ తెలంగాణలో ఆ ప్రభావం ఉండబోదు. తెలంగాణలోని పెట్రోలు ధరలో 31 శాతం, డీజిల్ ధరలో 22.25 శాతం మేర ప్రస్తుతం వ్యాట్ కలసి ఉంటోంది. వ్ాయట్ రాబడిలో చాలా భాగం ఈ పెట్రోల్, డీజిల్ ద్వారానే సమకూరుతోంది.

శుక్రవారం కేంద్రం పెట్రో ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.2.65, డీజిల్‌ 2.45 తగ్గాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తగ్గిన ధరలతోనే అమ్మకాలు జరిగాయి. కానీ పెట్రో ధరలపై వ్యాట్‌ పిడుగు పడింది. కేంద్రం ఎక్సైజ్‌ సుంకం రూపంలో పెట్రో నుంచి సొమ్ములు పిండుకోగా, తెలంగాణ సర్కారు వ్యాట్‌‌ను పెంచేసి ఖజానా నింపుకోవాలని నిర్ణయించుకుంది.

VAT a blow? Fuel prices fall & rise in Telangana

పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.2 చొప్పున వ్యాట్‌ పెంచేసింది. గతంలో ఉన్న దానికి రెండు రూపాయలు అదనంగా చేర్చింది. దీంతో తెలంగాణ ప్రజలకు ధరల తగ్గింపు ఫలం పెట్రోలుపై లీటరుకు 65 పైసలు, డీజిల్‌పై 44 పైసలు మాత్రమే దక్కింది. తగ్గిన ధరలతో పెట్రోలు కొట్టిద్దామనుకుని బంకులకు వెళ్లిన వినియోగదారులు రెండు రూపాయలు ఎక్కువ ఎందుకు వసూలు చేస్తున్నారంటూ సిబ్బందితో వాదించారు.

కేంద్రం తగ్గించిందని, రాష్ట్రం వ్యాట్‌ పెంచిందని, అందుకే ఈ పెంపు అని వారికి వివరంగా చెప్పాల్సి వచ్చింది. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ పెంపుతో ఒక్క రాజధాని నుంచే నుంచే తెలంగాణ సర్కారుకు రోజుకు రూ.1.26 కోట్లు అదనంగా సమకూరనుంది. జంట నగరాలు, నగర శివారు ప్రాంతాల్లో రోజుకు 30 లక్షల లీటర్ల పెట్రోల్‌, 33 లక్షల లీటర్ల డీజిల్‌ అమ్మకాలు జరుగుతాయి. కాగా, వ్యాట్ పెంపు పైన సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మండిపడ్డారు.

English summary
The Telangana government has increased the value added tax on petrol and diesel in the state effectively nullifying the price reduction announced by oil companies on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X