మెగా ఫ్యామిలీకి అండగా ఉంటాం: వట్టి వసంత్ కుమార్, బాబు దీక్షపై రఘువీరా

అమరావతి: మెగా ఫ్యామిలికీ తాము అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ శుక్రవారం అన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పని చేస్తోందని, హోదాపై కాంగ్రెస్ నిబద్ధతను ఏపీ ప్రజలు హర్షిస్తున్నారని మాజీ ఎంపీ జేడీ శీలం వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి దీక్షపై రఘువీరా సెటైర్లు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీక్షపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. నాలుగేళ్లుగా బీజేపీకి టీడీపీ మద్దతిచ్చిందని గుర్తు చేశారు.

Vatti Vasanth Kumar says they are with Mega Family

ఇపుడు ఉద్యమాలు చేస్తామంటే ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. కాంగ్రెస్అ ధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తామన్నారు. చంద్రబాబు ఎన్నికల దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు.

దీక్ష పేరుతో కోట్ల నిధులు దుర్వియోగం అవుతున్నాయని రఘువీరా విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే జైలులో పెట్టారని, ఇప్పుడు హోదా కోసం మళ్లీ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ పాలనలో దళితులకు, మహిళలకు రక్షణ లేదన్నారు. కర్నాటకలోని తెలుగువారు బీజేపీని ఓడించాలని పిలుపు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+