వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు తీపికబురు.. నేడు మూడవ విడత పరిహారం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులోగా ప్రారంభించుకోవాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు సంబంధించి ప్రభుత్వం శరవేగంగా కీలక నిర్ణయం తీసుకుంటుంది. వెలిగొండ ప్రాజెక్టు కారణంగా తమ భూములు ఇల్లు కోల్పోయిన నిర్వాసితులైన కుటుంబాలకు ఇప్పటికే రెండు విడతలుగా పరిహారం చెల్లింపులు చేసిన ప్రభుత్వం నేడు మూడో విడత పునరావాస పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.

మూడవ విడత కింద 2027 కుటుంబాలకు 250 కోట్ల రూపాయల పరిహారం

ప్రకాశం జిల్లాలోని ముంపు ప్రాంతాలతో పాటు సమీప ప్రాంతాలలో ఉన్న ముంపు గ్రామాల బాధితులకు ఈ పరిహారం ద్వారా ఊరట కల్పించనుంది ఏపీ సర్కార్. ప్రభుత్వం ఇప్పటివరకు రెండు విడతల్లో 518 కోట్ల రూపాయలను చెల్లించినట్లు ప్రకటించింది. ఇప్పుడు మూడవ విడత కింద 2027 కుటుంబాలకు 250 కోట్ల రూపాయల విలువైన చెక్కులు అందించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది.

veligonda project Ap govt to distribute third phase compensation of Rs 250 crore to 2 027 Veligonda project displaced families today

నేరుగా చెక్కులు అందజేయనున్న సీఎం చంద్రబాబు

ఈ క్రమంలో ఉండవల్లి లోని తన నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వాసిత కుటుంబాల ప్రతినిధులతో నేరుగా మాట్లాడి వారికి ఈ చెక్కులను అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.అయితే క్షేత్రస్థాయిలో కొంతమంది నిర్వాసితులు తమకు ఇంకా పూర్తి పరిహారం అందలేదని ఆందోళనలో ఉన్నారు. అధికారిక జాబితాలో తమ పేర్లు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు కూడా లేకపోలేదు.

పూర్తిస్థాయి పరిహారంతో పాటు సరైన పునరావాసం కల్పించాలని డిమాండ్

పరిహారం అరకొరగా అందుతుందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పూర్తిస్థాయి పరిహారంతో పాటు సరైన పునరావాసం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం త్వరితగతిన పునరావాస ప్యాకేజీకి సంబంధించి బాధితులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని పూర్తిచేసి వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది.

ఆదిలాబాద్ జిల్లా యువతకు శుభవార్త చెప్పిన తెలంగాణా సర్కార్.. ఐటీ ఉద్యోగాలు మీ గుమ్మంలోకే!
ఆదిలాబాద్ జిల్లా యువతకు శుభవార్త చెప్పిన తెలంగాణా సర్కార్.. ఐటీ ఉద్యోగాలు మీ గుమ్మంలోకే!

త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్న కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన నీటిపారుదల పథకాలలో ఒకటైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాల ప్రజలకు తాగునీరు, సాగు నీటిని అందించి అక్కడ ప్రజల అవసరాలను తీర్చనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు పూర్తికాగా త్వరలోనే ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+