మళ్లీ వైసీపీ గూటికి వేమిరెడ్డి దంపతులు ? క్లారిటీ ఇదే..!
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సొంత పార్టీల్లో టికెట్ దక్కని నేతలంతా ప్రత్యర్ధి పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. తిరిగి అక్కడ కూడా పరిస్దితుల్లో తేడా వస్తే పాత పార్టీల్లోకి వచ్చేస్తున్నారు. ఇదే క్రమంలో నెల్లూరులో వైసీపీ అభ్యర్ధిగా ఎంపికై ఆ తర్వాత సీఎం జగన్ తీరు నచ్చక టీడీపీలోకి ఫిరాయించి ఎంపీ టికెట్ దక్కించుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న ఆయన భార్య ప్రశాంతి రెడ్డి తిరిగి వైసీపీవైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
సుదీర్ఘకాలం వైసీపీలో కొనసాగి తాజాగా టీడీపీలో చేరినా అక్కడ ఇమడలేక వేమిరెడ్డి దంపతులు తిరిగి సొంత పార్టీవైపు చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై వీరిద్దరూ తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్న ప్రచారమే అని వీరిద్దరూ తేల్చి చెప్పేశారు. అలా రోజుకో పార్టీ మారి చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ నాయకులు తాము పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని వేమిరెడ్డి దంపతులు మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ లో ఓ వీడియో విడుదల చేశారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని టీడీపీ కార్యకర్తలకు, తమ అనుచరులకు సూచించారు. టీడీపీని వీడే ప్రసక్తే లేదని, పార్టీలో తమకు గౌరవం లభిస్తోందని తెలిపారు. తమకు లభిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేకపోతున్నారని ఆరోపించచారు. టీడీపీలోనే తాము ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలవబోతున్నట్లు కూడా వారు ధీమా వ్యక్తం చేశారు.
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు, మేము టిడిపిని వీడే ప్రసక్తే లేదు - వీ పి ఆర్ దంపతులు
— Vemireddy Prabhakar Reddy (@VPR_Official_) April 7, 2024
- ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా తాను కచ్చితంగా గెలుపొందుతాం - ప్రశాంతి రెడ్డి
- కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు - వీ పి ఆర్
- టిడిపిలో మాకు గౌరవం ఉంది.
తమ పార్టీ… pic.twitter.com/iMj7GwWKlD












Click it and Unblock the Notifications