బాహుబలిపై వెంకయ్య కామెంట్స్: శివగామి రమ్యకృష్ణ స్పందన ఇదీ..

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి - ది కంక్లూజన్ సినిమాపై కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు కూడా స్పందించారు. సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుని వెల్లిన ఘనత బాహుబలి -2కు దక్కిందని ఆయన అన్నారు.

ప్రాంతీయ భాషా చిత్రంగా (తెలుగు) వచ్చినప్పటికీ మన గొప్పతనాన్ని విదేశాలకు చాటి చెప్పే విధంగా తెరకెక్కించిన సినిమా యూనిట్‌ను ట్విట్టర్ వేదికగా అభినందించారు. బాహుబలిపై సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు.

Ramyakrishna

బాహుబలి సినిమాలో శివగామిగా నటించిన తనపై అభిమానం, ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి రమ్యకృష్ణ ట్విట్టర్ లో కృతజ్ఞతలు తెలిపింది. ఫ్యాన్స్ వలనే ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉన్నానని ఆమె చెప్పుకుంది. చివరిగా జై మాహిష్మతి అని చెప్పింది.

బాహుబలి చిత్రంతో రమ్యకృష్ణ కాస్త శివగామిగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రమ్య కృష్ణ చేసిన పవర్ ఫుల్ పాత్రకు ప్రేక్షకులు జైకొడుతున్నారు. కొన్నాళ్ల వరకు ఈమె పాత్ర అచ్చు పోసినట్లు అందరి మనస్సులో ఉండిపోతుంది. నరసింహ సినిమాలో నీలాంబరి పాత్ర తర్వాత రమ్య కృష్ణ చేసిన పవర్ ఫుల్ పాత్ర ఇదే అని చెప్పవచ్చు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union minister and BJP senior leader M Venkaiah Naidu made comments on Rajamouli's Bahubali: The conclusion film.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి