కాంగ్రెస్‌పై వెంకయ్య ఫైర్: నాగం వాహనంపై రాళ్ల దాడి
హైదరాబాద్/మహబూబ్‌నగర్: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హవా లేదంటున్న కాంగ్రెస్, ఎందుకు భయపడుతోందని బిజెపి సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ పాలనకు, అభివృద్ధికి సమాధానం చెప్పలేకనే కాంగ్రెస్ పార్టీ బిజెపిపై అవాస్తవ ఆరోపణలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ బాధ్యత లేకుండానే అధికారం అనుభవించారని ఆరోపించారు.
కాంగ్రెస్ అసలు స్వరూపం బయటపడిందని వెంకయ్య నాయుడు చెప్పారు. నరేంద్ర మోడీ ధీటైనా నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ పోటీ పడలేకపోతోందని అన్నారు. స్థిరమైన ప్రభుత్వంతోనే దృఢమైన నిర్ణయాలు సాధ్యమవుతాయని చెప్పారు. ఎన్డీఏతోనే స్థిరమైన ప్రభుత్వం సాధ్యమవుతుందని వెంకయ్య నాయుడు అన్నారు. మోడీ హవా లేదంటూనే.. కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని, అవాస్తవమైన, వ్యక్తిగత ఆరోపణలకు దిగుతోందని అన్నారు.

నాగం వాహనంపై రాళ్ల దాడి
మహబూబ్‌నగర్: జిల్లాలోని మక్తల్‌లో బిజెపి ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి వాహనంపై రాళ్ల దాడి జరిగింది. తమ నాయకులకు ఎన్నికల్లో సీటు రాకుండా చేశారని ఆరోపిస్తూ పలువురు పార్టీ కార్యకర్తలు ఆయన వాహనంపై రాళ్ల దాడి చేశారు. నాగం జనార్ధన్ రెడ్డి సర్దిచెప్పాలని ప్రయత్నించినప్పటికీ ఆ చర్యలు ఫలించలేదు.
బిజెపి, తెలుగుదేశం పార్టీల పొత్తులో భాగంగా మక్తల్ స్థానాన్ని టిడిపికి ఇచ్చినందుకు మనస్థాపంతో బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు కొండయ్య ప్రకటించారు. మక్తల్ అసెంబ్లీ స్థానానికి వేసిన నామినేషన్‌ను కొండయ్య శనివారం ఉపసంహరించుకున్నారు. దీంతో అసంతృప్తితో ఉన్న కొండయ్యను బుజ్జగించేందుకు వచ్చిన నాగం జనార్ధన్ రెడ్డిని కొండయ్య వర్గీయులు అడ్డుకున్నారు. నాగం వాహనంపై రాళ్ల దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు.
-
కేసీఆర్, హరీశ్ ను జైలులో పెట్టిన తర్వాతే - రేవంత్ సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications