రొమాంటిక్ సీన్స్ ఎలా ఉండాలో చెప్పిన వెంకయ్య..
న్యూఢిల్లీ : కేంద్ర ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌కాస్టింగ్ శాఖా మంత్రి వెంకయ్య నాయుడు సినిమాల్లో రొమాంటిక్ సీన్లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓసారి రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన కార్యక్రమంలోను.. ఇప్పటి తారలకు శృంగార రసం పలికించడం రాదు అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నవెంకయ్య.. సినిమాల్లో అశ్లీలతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముందని అభిప్రాయపడ్డారు. హీరోయిన్‌ను తాకకుండానే రొమాన్స్ ను రక్తి కట్టించవచ్చునని, కళ్లు, పెదవులు, ముక్కు, చూపులతోనే రొమాన్స్‌ను పలికించవచ్చంటూ సూచనలు చేశారు.

హీరోయిన్లను అసభ్యంగా చూపించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన వెంకయ్య.. అలాంటి పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. పీకే,నో వన్ కిల్ల్‌డ్ జెస్సికా, లగేరహో మున్నాభాయ్, ఓయ్ లక్కీ లక్కీ ఓయ్, మున్నాభాయ్ ఎంబీబీఎస్.. తన అభిమాన చిత్రాలని చెప్పారు. సందేశాత్మక చిత్రాలు సమాజానికి అందిస్తే బాగుంటుందని ఈ సందర్బంగా వెంకయ్య అభిప్రాయపడ్డారు. హింస, అశ్లీలత వంటి వాటికి తావివ్వకుండా భావోద్వేగాలే ప్రధానంగా సాగే చిత్రాలను నిర్మిస్తే బాగుంటుందని హితవు పలికారు.












Click it and Unblock the Notifications