వెంకయ్య సూచనలు చంద్రబాబు అమలు చేస్తారా..!!
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. పోలీసు స్టేషన్లపై, రెవెన్యూ కార్యాలయంపై పెత్తనం కాకుండా అభివృద్ధిపై నేతలు దృష్టి ఉండాలని హితవు పలికారు. ఏపీలో తాజా ఎన్నికల ఫలితాల పైన స్పందించారు. అదే సమయంలో ఉచిత పథకాల పైన వెంకయ్య కీలక సూచనలు చేసారు. ప్రజా జీవితంలో సిద్ధాంతాలు, విలువలు, సంప్రదాయాలను గౌరవించాలని పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజాప్రతినిధులకు ఉద్భోదించారు.
ప్రతికూల పరిస్థితుల్లో
వెంకయ్యనాయుడు తాను చిన్నతనం నుంచి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని అవకాశాలుగా మలచుకుంటూ ముందడుగు వేశానని చెప్పారు. చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడం ఒక్కటే తనకు తీరని వెలితి తప్ప ఇంతవరకు ఎందులోనూ తనకు అసంతృప్తి లేదన్నారు. న్యాయవాది కావాలనే తన తల్లి ఆలోచనకు అనుణంగా లా చదివినాని చెప్పారు. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జన్సీ కారణంగా జైలుకు వెళ్లి న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేయలేకపోయానని చెప్పారు.

మార్పు రావాలి
ప్రజాప్రతినిధుల ఆలోచనల్లో మార్పులు రావాలని, చట్టసభల్లో మాట్లాడేటప్పుడు మంచి భాష ఉపయోగించాలని సూచించారు. రాజ్యసభ ఛైర్మన్‌ను సైతం ధిక్కరించి కొందరి సభ్యుల ప్రవర్తనపై సునిశితంగా స్పందించారు. సంప్రదాయాలు, ఉత్తమ సంస్కారం అనివార్యమన్నారు. రాష్ట్రంలోనూ ఆ పద్ధతి పాటించకుండా బూతులు మాట్లాడిన వారికి ఇటీవలి ఎన్నికల్లో తగిన గుణపాఠం ఎదురైందన్నారు. పార్టీలు వేరైనా అంతా ప్రత్యర్ధులమే తప్ప శత్రువులు కాదనే భావన ఉండాలన్నారు.
ఫ్రీగా ఇవ్వకపోయినా
ప్రజలకు వైద్యం, చదువు ఉచితంగా అందిస్తే సరిపోతుందని వెంకయ్యనాయుడు అన్నారు. మిగతావి ఫ్రీగా ఇవ్వకపోయిన పర్వాలేదని చెప్పారు. తద్వారా దేశం, రాష్ట్రాలు బాగుపడుతాయని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. పథకాలు ఉచితంగా ఇచ్చే బదులు ప్రజలకు పనిలో శిక్షణ ఇవ్వాలని వివరించారు. ఫలితంగా వారు ఉపాధి పొందుతారని వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఏపీలో ఉచిత పథకాల పైన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు..కూటమి ప్రభుత్వం అమలు పై చర్చ జరుగుతున్న వేళ వెంకయ్య వ్యాఖ్యల ప్రభావం చంద్రబాబు పాలనలో ఏ మేరకు ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications