ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ తెర పైకి వెంకయ్య- మారుతున్న లెక్కలు..!!
ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉప రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయింది. కొత్త ఉపరాష్ట్రపతితో పాటుగా బీజేపీ చీఫ్ ఖరారు పైన ప్రధాని మోదీ కసరత్తు చేస్తున్నారు. రేసులో పలువురు సీనియర్లు ఉన్నారు. కాగా, ఇదే సమయంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో కీలకంగా మారారు. ప్రధాని మోదీ తో సమావేశం అయ్యారు. ఆరెస్సెస్, బీజేపీ ముఖ్యులతోనూ మంత్రాంగం సాగింది. దీంతో.. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
ప్రధానితో భేటీ
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఢిల్లీలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి, బీజేపీ జాతీయాధ్యక్షుడి ఎంపిక వేళ వెంకయ్య నాయుడు సమావేశాలు కీలకంగా మారుతున్నాయి. ప్రధాని మోదీ సహా పలువురు ఆర్‌ఎస్ఎస్, సంఘ్ పెద్దలను కలుసుకున్నారు. కొద్ది రోజులుగా బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ మధ్య జరుగుతున్న పరిణామాలు, దేశ రాజకీయాలు, ఉప రాష్ట్రపతి నియామకం ఇతర సంస్థాగత అంశాలపై నేతలు వెంకయ్య సలహాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నివాసానికి వెళ్లిన వెంకయ్య దాదాపు 40 నిమిషాలపాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. ట్రంప్ టారిఫ్ ల పట్ల స్వతంత్ర నిర్ణయం తీసుకోవాలని, ఆ దేశంతో స్నేహ సంబంధా లు కొనసాగిస్తూనే మన ఆర్థిక, విదేశాంగ విధానం స్వతంత్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న విషయంలో వెంకయ్య తన అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం.

కీలక మంత్రాంగం
అదే విధంగా బీజేపీ అధ్యక్షుడి నియామకం కూడా త్వరలో జరుగుతుందని మోదీ ఆయనకు చెప్పినట్లు తెలిసింది. ఇక, వెంకయ్య నాయుడు ఢిల్లీలోని దేశ బంధు గుప్త రోడ్‌లో నూతనంగా నిర్మించిన ఆర్‌ఎస్సెస్ కార్యాలయానికి వెళ్లారు. సంఘ్ నేతలతో పాటు పలువురు ప్రముఖులతో దాదాపు గంటకుపైగా ఏకాంతంగా చర్చలు జరిపారు. జాతీయ రాజకీయాలు, బీజేపీ అధ్యక్షుడి నియామకం, ఇతర అంశాలపై వారు మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం వెంకయ్య నివాసానికి బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) శివప్రకాశ్ వచ్చి సుదీర్ఘ చర్చలు జరిపారు. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై వారు చర్చించినట్లు తెలిసింది.
Visited the newly-built RSS Office in Keshav Kunj, New Delhi with my friends, Shri Tummala Ranga Rao & Dr. Kamineni Srinivas, this morning and interacted with senior functionaries of the organisation. What was impressive about the building was the impressive classical Indian… pic.twitter.com/f9VbYwNAxy
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 10, 2025
రేసులో నేతలు
ఇక, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే విధంగ ధర్మేంద్ర ప్రదాన్, భూపేంద్ర యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇలా, ఉప రాష్ట్రపతి.. బీజేపీ జాతీయాధ్యక్షుడి ఎంపిక వేళ వెంకయ్య నాయుడు ఢిల్లీ పర్యటన, ముఖ్యులతో వరుస భేటీలు ఆసక్తి కరంగా మారాయి. ఆగస్టు 15 తరువాత నూతన ఉప రాష్ట్రపతి తో పాటుగా బీజేపీ కొత్త చీఫ్ విషయంలోనూ ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications