నారాయణ సంచలన వ్యాఖ్యలు: వెంకయ్య పెదాల కదలిక మాధురీ దీక్షిత్ డ్యాన్స్‌లా..!
తిరుపతి: ఎగతాళి చేసేవారిని చున్నీతో ఉరివేసి చంపాలంటూ సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం తిరుపతిలో జరుగుతున్న ఏఐఎస్‌ఎఫ్ 80వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పెదాల కదలిక మాధురీ దీక్షిత్ డ్యాన్స్‌లా ఉంటుందని వ్యాఖ్యానించారు.
విద్యార్ధులు సమాజిక, రాజకీయ సమస్యలపై ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో పెరిగిన ర్యాగింగ్ వికృత పోకడలకు అమ్మాయిలు ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలని అన్నారు. ర్యాంగింగ్‌కు పాల్పడే వారిని తమ చున్నీలతో ఉరేయాలని అన్నారు. అలాంటి అమ్మాయిలకు సీపీఐ, ఏఐఎస్‌ఎఫ్‌లు అండగా ఉంటాయన్నారు.

వయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు పార్క్‌ల్లో మాట్లాడుకోవాలని అంటున్నారు. అదే బహుబలి సినిమా టిక్కెట్లను మూడు వేలకు అమ్ముకోండంటూ పనికిమాలిన కోర్టు అనుమతిచ్చిందని మండిపడ్డారు. 45 ఏళ్ల కిందట తాను విద్యార్ధిగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అనుభవాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయని అన్నారు.
ప్రస్తుతం సమాజంలో రౌడీలు, గుండాలు లేరని, వారంతా అసెంబ్లీ, పార్లమెంట్లో ఉన్నారని పేర్కొన్నారు. అందువల్లే సమావేశాలు సజావుగా జరగక్కుండా గొడవులు జరుగుతున్నాయని తెలిపారు. సమాజంలో కమ్యూనిపార్టీ ఉద్యమాలు బలహీనంగా ఉండటం వల్లే సమస్యలుఎదుర్కొలేక ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇదే ఎస్వీయూలో విద్యార్థి నాయకుడిగా ఉండి సీఎంగా ఎదిగిన చంద్రబాబు ఇప్పుడు విద్యార్థులకు మాత్రం రాజకీయలు అవసరం లేదంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై మోడీ కనుసైగ చేయగానే మాధురీదీక్షిత్ డ్యాన్స్‌లా వెంకయ్య పెదాలు కదులుతున్నాయని నారాయణ ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా ఇవ్వలేమని ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications