తెలుగు ఎంపీల ఆందోళనకి వెంకయ్య మద్దతు, క్లిష్టమైంది.. హోదాపై వివరణ
న్యూఢిల్లీ/రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం నాడు పార్లమెంటులో వివరణ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు చేసిన ఆందోళనలో అర్థం ఉందని ఎంపీలకు మద్దతుగా నిలిచారు.
ప్రత్యేక హోదా విషయమై మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా చాలా క్లిష్టమైన సమస్య అని చెప్పారు. అది విభజన చట్టంలో లేదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ దీనిని ఆర్థిక శాఖ పరిశీలిస్తోందని తెలిపారు. తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం, తాము ఇచ్చిన హామీలను అన్నింటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణలకు ఇచ్చిన హామీలను తాము నెరవేరుస్తామని చెప్పారు. విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సమస్యలు వాస్తవమేనని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, 14వ ఆర్థిక సంఘం అంశాలను కేంద్రం చర్చిస్తుందన్నారు.
మురళీ మోహన్ ఇంటి ముట్టడి
సిపిఐ మంగళవారం నాడు తెలుగుదేశం పార్టీ ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ ఇంటిని ముట్టడించింది. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తాను రాజీనామా చేస్తానని, వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications