విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన అత్యంత విషపూరిత సముద్రపు పాములు

విశాఖపట్నం:విశాఖలో ప్రసిద్ద పర్యాటక స్థలం రుషికొండ బీచ్‌కు సోమవారం అత్యంత విషపూరితమైన సముద్రపు పాముల మృత కళేబరాలు కొట్టుకురావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

భూమి మీద జీవించేనట్లే అనంత సాగర గర్భంలోను అనేక వేల రకాల పాములు జీవిస్తూ ఉంటాయనే సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని భూమి మీద నివసించే సర్పాల కంటే ఎన్నో రెట్లు విషపూరితమైనవి కావడం గమనార్హ్ం. అలాంటి అత్యంత పాయిజనెస్ రకానికి చెందిన కొన్ని పాములు రుషి కొండ తీరానికి ఒకేసారి కొట్టుకు రావడం కలకలం రేపింది.

Venomous sea snakes off Visakha Beach

అయితే ఇవి చూసేందుకు కూడా వింతగా ఉండటంతో పర్యాటకుల్లో కొందరు ఇవి అత్యంత విషపూరితమైనవని తెలియక వీటిని కర్రలతో అటూ ఇటూ కదిలిస్తూ వినోదంగా చూసారు. అయితే విషపూరితమైన పాముల కళేబరాలు సముద్రానికి కొట్టుకువచ్చిన సమాచారం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న కమ్యూనిటీ గార్డులు, వీటిని పరిశీలించిన అనంతరం ఇవి అత్యంత విషపూరితమైన సముద్రపు పాములుగా తేల్చారు.

వీటిలో ఒకటి తట్టు పాము కాగా మరొకటి పెలాజిక్ పాముగా గుర్తించారు. తట్టు పాము కరిస్తే యాంటి వీనమ్ తీసుకున్నా పనిచేయదని, మరణం తప్పదని జాలర్లు చెబుతున్నారు. పెలాజిక్ పాము కూడా అత్యంత విషపూరితమని అంటున్నారు. దీంతో ఆ తరువాత వీటిని కర్రతో సైతం తాకేందుకు భయపడిన పర్యాటకులు దూరం నుంచే చూస్తూ ఇవి హఠాత్తుగా ఇలా ఎందుకు కొట్టుకొచ్చాయోనని చర్చించుకోవడం మొదలుపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+