త్వరలోనే వాళ్లిద్దరూ విడిపోతారు: వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం వేణుస్వామి అనే పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు, సినీతారల్లాంటి సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన కూడా మరో సెలబ్రిటీ అయిపోయారు. వాస్తవానికి ఎవరో ఒకరు ఎప్పుడూ చెబుతుండే జాతకాలను వీరెవరూ పట్టించుకునేవారు కాదు. కాకపోతే కొందరు సెలబ్రిటీల జాతక విషయంలో ఆయన చెప్పినవి నిజమవడంతో వేణుస్వామి గతంలో ఏం చెప్పారు? ఎవరి గురించి చెప్పారు? ఏం జరగబోతోంది? అనే విషయాలపై నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు.
సమంత, నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, రష్మిక లాంటి జాతకాలను చెబుతూ వారిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసేవారు. సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పిన విషయం నిజమవడంతో ఆయన గతంలో చెప్పిన వీడియోలన్నీ వైరలవుతున్నాయి. రష్మిక, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు ఆయనచేత పరిహారానికి పూజలు చేయించుకున్నారు. ఇటీవలే డింపుల్ హయతి కూడా వేణుస్వామిచేత పూజలు చేయించుకున్నారు.ఈ పూజలకు సంబంధించిన వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నాగచైతన్య, సమంతలానే ఆది పినిశెట్టి నిక్కీ గల్రాని జంట కూడా విడిపోతారని చెప్పారు. వీరి జాతకాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత వీరు కలిసి ఉండటం అసాధ్యమని, విడాకులకు 80 శాతం అవకాశం ఉందని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆది, నిక్కీ ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతానికి వీరిద్దరూ సంతోషంగానే ఉన్నారు. అయితే వేణుస్వామి కామెంట్లతో ఏమైనా మారుతుందేమో చూడాలి మరి.













Click it and Unblock the Notifications