Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై తీర్పు రిజర్వు..

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపుపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో చెప్పిన ప్రకారం ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను ప్రొఫెసర్ కె. పురుషోత్తంరెడ్డి దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ.. విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగాల్సిన అవసరం ఉందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అలానే జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన కోసం ప్రత్యేకంగా డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు.

verdict-reserved-on-increase-in-assembly-seats-in-telugu-states

కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలాంటి అవకాశాన్ని ఇవ్వలేదన్నారు. ఇది అసమానత అని.. రాజ్యాంగ విరుద్ధం అంటూ ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య నియోజకవర్గాల పునర్విభజన విషయంలో తేడా చేయకూడదని పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజన్ మాట్లాడుతూ.. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన కోసం 2026 తర్వాత విడుదలయ్యే జనాభా లెక్కలు రావాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు" అని వివరణ ఇచ్చారు. ఆర్టికల్ 82లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వ్యవస్థకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించబడ్డాయని కేంద్రం స్పష్టం చేసింది.

జనాభా లెక్కల ఆధారంగా మాత్రమే అసెంబ్లీ సీట్లను పెంచగలమని తేల్చిచెప్పింది. ఇక జమ్మూకశ్మీర్ విషయంలో ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం చట్టపరమైనదే అని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ సూర్యకాంత్‌ తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+