వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుగ్గిరాల‌లో మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ఇంటివ‌ద్ద ఉద్రిక్త‌త‌

|
Google Oneindia TeluguNews

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఇంటివ‌ద్ద ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి చింత‌మ‌నేని ప్ర‌య‌త్నించ‌గా పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు వాయిదాకు వెళ్లాల‌ని చెప్పిన‌ప్ప‌టికీ పోలీసులు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఇరువ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ నాయ‌కులు బ‌డేటి చంటి, గ‌న్ని వీరాంజ‌నేయులుతోపాటు కార్య‌క‌ర్త‌లంతా వెంట‌నే చింత‌మ‌నేని ఇంటివ‌ద్ద‌కు చేరుకోవ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయిన‌ప్ప‌టికీ పోలీసులు చింత‌మ‌నేని బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి అంగీక‌రించ‌లేదు. ఆయ‌న్ను హౌస్ అరెస్ట్ చేశారు.

సోష‌ల్ మీడియా పోస్టుల‌పై ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

సోష‌ల్ మీడియా పోస్టుల‌పై ఇరువ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

దెందులూరులో సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన పోస్టుల‌పై తెలుగుదేశం, వైసీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఇరువ‌ర్గాలు ఒక‌రిపై ఒక‌రు క‌ర్ర‌లతో దాడిచేసుకోవ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ఈ రెండు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నించిన పోలీసులు కూడా గాయ‌ప‌డ్డారు. ఎస్‌.ఐ.కి స్వ‌ల్ప గాయాల‌య్యాయి. దీంతో మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఎటువంటి గొడ‌వ‌ల‌కు ఆస్కారం ఇవ్వ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

స్పంద‌న కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్‌కు చింత‌మ‌నేని ఫిర్యాదు

స్పంద‌న కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్‌కు చింత‌మ‌నేని ఫిర్యాదు

రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌తి సోమ‌వారం అన్ని జిల్లా కార్యాల‌యాల్లో స్పంద‌న కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కూడా స్పంద‌న‌లో ఇన్ ఛార్జి క‌లెక్ట‌ర్ అరుణ్‌బాబును క‌లిసి త‌న‌ను హ‌త్య‌చేయ‌డానికి ఓ ఆగంత‌కుడు ఫోన్ చేసి బెదిరించారంటూ ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చిన ఫోన్ నెంబ‌రు, కాల్ రికార్డింగ్‌ను ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేష‌న్లో అందించిన‌ప్ప‌టికీ ఇంత‌వ‌ర‌కు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని, కేసు న‌మోదు చేయ‌లేద‌ని ఫిర్యాదు చేశారు.

జ‌గ‌న్‌కు ద‌మ్ము, ధైర్యం ఉంటే ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటు చేయాలి

జ‌గ‌న్‌కు ద‌మ్ము, ధైర్యం ఉంటే ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటు చేయాలి

త‌న‌ను హ‌త్య చేయ‌డానికి కుట్ర జ‌రుగుతోంద‌ని, ప్ర‌భుత్వం త‌న‌పై ఇప్ప‌టివ‌ర‌కు 26 కేసులు పెట్టింద‌ని, అందులో 14 కేసులు ఎస్సీ, ఎస్టీ కేసులున్నాయ‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ద‌మ్ము, ధైర్యం ఉంటే ఒక ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటు చేసి విచార‌ణ చేయించాల‌ని స‌వాల్ విసిరారు. మంత్రులు జోగి రమేష్‌, కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌తోపాటు వైవీ సుబ్బారెడ్డి నేనేమిటో తెలుసుకొని మాట్లాడాల‌ని సూచించారు. దిశ డీఎస్పీ స‌త్య‌నారాయ‌ణ త‌న‌పై కావాల‌నే కుట్ర‌చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

నాది ఈవ్‌టీజింగ్ చేసే వ‌య‌సా?

నాది ఈవ్‌టీజింగ్ చేసే వ‌య‌సా?

బి.సింగ‌వ‌రంలో త‌న‌పై ఈవ్ టీజింగ్ కేసు పెట్టార‌ని, త‌న‌ది ఈవ్ టీజింగ్ చేసే వ‌య‌సా? అంటూ ఆయ‌న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఇంత‌కంటే దారుణం ఉంటుందా? అని ప్ర‌శ్నించారు. దేనికీ భ‌య‌ప‌డేది లేద‌ని, ఈరోజు నేనుపోతే నా వెన‌క ఉన్న‌వాడు వ‌చ్చి పోరాడ‌తాడ‌తార‌ని చింత‌మ‌నేని స్ప‌ష్టం చేశారు.

English summary
Former MLA Chintamaneni in Duggirala is tense at home
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X