టీడీపీలోకి మోహన్‌బాబు రీ ఎంట్రీ - మనోజ్ బిగ్ డెసిషన్..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మోహన్‌బాబు రాజకీయంగా తిరిగి యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో వివాదాలతో మోహన్‌బాబు మనస్థాపానికి గురయ్యారు. తాజాగా మంచు మనోజ్ మంత్రి లోకేష్ ను కలిసారు. ఈ సమయంలోనే మోహన్‌బాబు వేగంగా పావులు కదిపారు. కొత్త నిర్ణయం దిశగా ప్రకటన కు సిద్దమయినట్లు తెలుస్తోంది.
మోహన్‌బాబు కొత్త ప్లాన్
మోహన్‌బాబు తిరిగి టీడీపీలో చేరబోతున్నారా. తాజా పరిణామాలు.. సన్నిహిత వర్గాలు అవుననే చెబుతున్నాయి. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా .. 1995 నుంచి 2001 వరకు టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా మోహన్‌బాబు వ్యవహరించారు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటు న్నారు. 2019 ఎన్నికల ముందు జగన్ ను కలిసి వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసారు. వైఎస్ కుటుంబంతో మోహన్ బాబుకు వియ్యం ఉంది. 2019 లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్‌బాబు కు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు దక్కుతాయని అందరూ భావించారు.

రీ ఎంట్రీ ఖాయమా
కానీ, మోహన్ బాబు కు ఎలాంటి పదవి దక్కలేదు. వైసీపీతోనూ మోహన్‌బాబు దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో మంచు విష్ణు తాడేపల్లిలో జగన్ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మోహన్ బాబు ఆ సమయంలో బీజేపీలో చేరుతారనే సంకేతాలు ఇచ్చారు. కాగా, కొంత కాలంగా మంచు కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. కేసుల వరకు వెళ్లాయి. ఈ మధ్య కాలం లోనే మోహన్‌బాబు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసారు. సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఆ సమయంలోనే రాజకీయంగా చర్చించారనే ప్రచారం సాగింది. కానీ, సాయిబాబా ఆలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించినట్లు మోహన్‌బాబు వెల్లడించారు. ఇక.. తాజాగా సంక్రాంతి సమయంలోనే మోహన్‌బాబు విద్యాసంస్థల ముందు చంద్రబాబు, లోకేష్ ప్లేక్సీలు కొత్త చర్చకు కారణమయ్యాయి. అక్కడే చంద్రబాబుతో మోహన్ బాబు దిగిన ఫొటో ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు.
మనోజ్ భేటీతో
మోహన్‌బాబు వర్సిటీ ఆవరణలో చంద్రబాబుతో కలిసి ఉన్న డిజిటల్ బోర్డుల ఏర్పాటు వేళ తాను తిరిగి టీడీపీలోకి వెళ్తున్నాననే సంకేతాలు ఇచ్చినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప తెరకెక్కుతోంది. ఇదే సమయంలో మంచు మనోజ్ అయితే నేరుగా నారావారిపల్లి లో లోకేష్ తో సమావేశం అయ్యారు. మనోజ్ తొలి నుంచి టీడీపీ - జనసేన ముఖ్యులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అటు మోహన్ బాబు టీడీపీలో చేరుతున్నారనే ప్రచారం.. ఇటు మనోజ్ ప్రయత్నాలతో ఎవరు ఏ పార్టీలో ఎంట్రీ ఇవ్వనున్నారే అనే చర్చ సినీ - పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కరంగా సాగుతోంది.












Click it and Unblock the Notifications