జగన్‌కంటే ముందే బాబు: టిపై విహెచ్, కెసిఆర్‌కు సలహా
న్యూఢిల్లీ: తెలంగాణ విషయంలో అసలు ద్రోహి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడేనని, ఆ తర్వాతే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు ఆరోపించారు.

ఆయన గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రావడం ఖాయమన్నారు. తెలంగాణ వస్తుందని తమ పార్టీ సీమాంధ్ర కాంగ్రెసు నాయకులకు కూడా తెలుసునన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు నిందించదగ్గ ద్రోహులన్నారు. తాము కాంగ్రెసులో ఉంటూనే తెలంగాణ సాధిస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన కె కేశవ రావు, వివేక్, మంద జగన్నాథంలు కాంగ్రెసు పార్టీ వ్యతిరేకులన్నారు. 2014 తెలంగాణ విద్రోహుల విచ్చిన్న సంవత్సరమన్నారు. ఎంతమంది ద్రోహులు ఏకమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి విలీనం ఆ పార్టీకే మంచిదంన్నారు. కెసిఆర్ తన పార్టీని విలీనం చేయకపోయినా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు.












Click it and Unblock the Notifications