లుంగీలోళ్లు వస్తారు, సెటిల్‌మెంట్లు చేస్తారు: విహెచ్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినందుకు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం ఆయన 'ఇందిరమ్మ విజయరథం' పేరిట బస్సు యాత్ర ప్రారంభించారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో పూజలు తరువాత బయలుదేరిన బస్సుకు మంత్రి జానారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని 15 ఎంపీ స్థానాల్లో గెలిపించుకోవడంతోపాటు, గణనీయమైన రీతిలో అసెంబ్లీ స్థానాలను అందించడమే సోనియా గాంధీకి అసలైన కృతజ్ఞత అవుతుందని విహెచ్ అన్నారు. తెలంగాణ ప్రజలు కొలిచే నల్లపోచమ్మ దేవత సోనియా గాంధీ అని శ్లాఘించారు. రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా దోచుకున్నది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డేనని మండిపడ్డారు.
తెలంగాణపై సిడబ్ల్యుసి నిర్ణయం తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు మన్ననలు పొందిందని, ఆ తర్వాత చంద్రబాబు సమ న్యాయం అంటున్న తీరు ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.
పది జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేయాల్సి ఉందని మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయినా పునర్నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి కోరారు. యూటీ, రాయల ప్రాతిపాదనలను తెలంగాణ ప్రజలు అంగీకరించబోరని పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications