సీమాంధ్ర నేతలపై విహెచ్ నిప్పులు: కిరణ్ ప్రెస్ మీట్

ముఖ్యమంత్రి బుద్ధిమంతుడని, బాగా పాలిస్తాడని మద్దతు పలికామని ఇలా మాట్లాడుతారనుకోలేదన్నారు. విభజన విషయంలో ముఖ్యమంత్రిని చూసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రివర్స్ అయ్యారన్నారు. విభజనపై రోడ్డు మ్యాపు అడిగినప్పుడు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు.
విభజనకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విత్తనం వేస్తే చంద్రబాబు నీరు పోశారన్నారు. విభజన విషయంలో ఇంత ఘాటుగా మాట్లాడుతున్న సీమాంధ్ర కాంగ్రెసు నేతలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. జగన్‌కు అట్టహాసంగా ఘన స్వాగతం పలకడమేమిటన్నారు.
ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఎంపి లగడపాటి రాజగోపాల్‌లది ఒకే స్కూలులో ఉందని ఎద్దేవా చేశారు. ఇల్లు అద్దె కోసం వచ్చి ఇల్లు నాదే అన్న చందంగా అశోక్ బాబు వైఖరి ఉందన్నారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఘాటు వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు కూడా తాము సముదాయించి అన్నదమ్ములుగా విడిపోదామని సూచించామన్నారు.
సీమాంధ్ర కాంగ్రెసు నేతలు సమైక్య ఆలోచన పక్కన పెట్టి సీమాంధ్రలో పార్టీని ఎలా బతికించుకోవాలో ఆలోచించుకోవాలని హితవు పలికారు. జగన్ గురించి మాట్లాడని నేతలు అధిష్టానాన్ని ప్రశ్నిస్తారా అన్నారు. వారు ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
7గంటలకు కిరణ్ విలేకరుల సమావేశం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఏడు గంటలకు విలేకరులతో మాట్లాడనున్నారు. విభజన నిర్ణయం అనంతరం ఆయన వ్యాఖ్యలు అధిష్టానాన్ని ప్రశ్నించేలా ఉండటంతో మరోసారి ఆయన మీడియా ముందుకు వస్తుండటంతో ఏం మాట్లాడుతారోననే ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications