పుస్తకాల్లో శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానం, పెద్దవాళ్లు చెప్పింది విశ్లేషించాలి: వెంకయ్య

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: పుస్తకాలలో శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానం ఇమిడి ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం అన్నారు. విజయవాడలో పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ బుక్ ఫేర్ 11 రోజుల పాటు జరగనుంది. ఈ కార్యక్రమంలో వెంకయ్యతో పాటు సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

ఫోటో ఎఫెక్ట్, దిమ్మతిరిగే షాక్: మహేష్ కత్తిపై హైపర్ ఆది మరో 'జబర్దస్త్' పంచ్

ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. మంచి స్నేహితుడు ఉంటే మంచిగా, చెడు స్నేహితుడు ఉంటే చెడుగా తయారయినట్లే, మంచి పుస్తకాన్ని, చెడు పుస్తకాన్ని కూడా ఎంచుకోవాలని సూచించారు. పుస్తక పఠనం చాలా ముఖ్యమైనదని చెప్పారు.

2018ని సీఎం చంద్రబాబు తెలుగు భాషా పరిరక్షణ ఏడాదిగా ప్రకటించడం సంతోషకరమని అన్నారు. పెద్దవాళ్లు చెప్పిన ప్రతి దానిని మనం విశ్లేషించాలన్నారు. జీవితం అనే పుస్తకంలో నిన్న అనేది పూర్తయిందని, రేపు అనే పేజీ ఖాళీగా ఉందన్నారు. ఎలా చేస్తామనేది మనమే ఆలోచించుకోవాలన్నారు.

నిత్య జీవితంలో పుస్తకానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. అక్షరానికి మనం దైవస్థానం ఇచ్చామన్నారు. పుస్తక మహోత్సవాన్ని నవతరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

పుస్తకానికి, అక్షరానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. సరస్వతీ దేవి విద్యకు అధిదేవత అన్నారు. నాశనం లేనిది అక్షరం అని, అదే అక్షరంతో భాష మొదలవుతుందన్నారు. సంగీతం, సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. పుస్తకాలు స్నేహితుడి లాంటివి అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vice President Venkaiah Naidu inaugurated Vijayawada Book Festival on Monday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి