ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ పర్యటన...అగ్రిహ్యాక్‌థాన్‌లో పాల్గోనున్న వెంకయ్యనాయుడు, చంద్రబాబు,

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

విశాఖ‌పట్టణం : భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖపట్టణం విచ్చేయనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తో కలసి అగ్రి హ్యాక్‌థాన్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

అగ్రి హ్యాక్‌థాన్‌ ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మెక్రోసాప్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ పాల్గోనుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా ఉపరాష్ట్రపతి పర్యటనలో మార్పులు జరిగాయి. తొలుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం సాయంత్రానికి విశాఖపట్టణం చేరుకుంటారని భావించారు. అయితే ఆ తరువాత టూర్ షెడ్యూల్లో మార్పు చేసి మంగళవారం మధ్యాహ్నానికే వైజాగ్ చేరుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించారు.

Vice-President M Venkaiah Naidu Tour In Visakhapatnam Today

నవంబర్14 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 1.40 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భారత వాయుసేన ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.40 నుంచి 1.50 వరకూ స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 1.50 గంటలకు రోడ్డుమార్గంలో బయలుదేరి 2.10 గంటలకు సాగర్‌నగర్‌ వెళ్లనున్నారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు సాగర్‌నగర్‌ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి బీచ్‌రోడ్డులోని కిర్లంపూడి లేఅవుట్‌లోని నివాసానికి చేరుకొని రాత్రికి అక్కడే బసచేస్తారు.

15వ తేదీ ఉదయం 10.40 గంటలకు కిర్లంపూడి లేఅవుట్‌ నుంచి బయలుదేరి ఏపీఐఐసీ మైదానానికి 11 గంటలకు చేరుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అగ్రిహ్యాక్‌థాన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.15 గంటల నుంచి సాయంత్రం 4 వరకూ సాగర్‌నగర్‌లో మధ్యాహ్న భోజనం, విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సాగర్‌నగర్‌ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి 4.25 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. వీడ్కోలు కార్యక్రమం అనంతరం 4.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరివెళతారు.

Vice-President M Venkaiah Naidu Tour In Visakhapatnam Today

అగ్రిహ్యాక్‌థాన్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఈనెల 15 వ తేదీ ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు రానున్నారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అగ్రిహ్యాక్‌థాన్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. 2.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ అగ్రిహ్యాక్‌థాన్‌లో జరిగే చర్చల్లో పాల్గొంటారు. సాయంత్రం పార్క్ హోటల్‌లో అతిథులకు ఇచ్చే విందులో పాల్గొంటారు. రాత్రి 8.30 గంటలకు బయలుదేరి పోర్టు అతిథి గృహానికి చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు. 16వ తేదీ పోర్టు అతిథి గృహం నుంచి బయలుదేరి 9.20 గంటలకు ఏపీఐఐసీ మైదానానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 1.30 వరకూ సదస్సులో పాల్గొంటారు. మద్యాహ్నభోజనం చేసిన అనంతరం సాయంత్రం వరకూ ప్యానల్‌ చర్చలో పాల్గొంటారు. సాయంత్రం 6.30గంటలకు బయలుదేరి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. 17వ తేదీ మధ్యాహ్నం 1.40 గంటలకు సీఎం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి విశాఖకు రానున్నారు.

విమానాశ్రయం నుంచి 2గంటలకు ఏపీఐఐసీ మైదానానికి వస్తారు. అక్కడ జరిగే అగ్రిహ్యాక్‌థాన్‌ ముగింపు సభలో బిల్‌గేట్స్‌తో కలిసి పాల్గొంటారు. సాయంత్రం 4.30గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 4.40 గంటలకు ఏపీఐఐసీ మైదానం నుంచి నోవాటెల్‌ హోటల్‌కు వెళ్తారు. అక్కడ జరిగే టూర్‌ ఆపరేటర్ల సదస్సు ముగింపు కార్యకమ్రంలో సీఎం పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు నోవాటెల్‌ నుంచి బయలుదేరి 5.30 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకొని ప్రత్యేక విమానంలో విజయవాడ తిరుగు ప్రయాణం అవుతారు.

Vice-President M Venkaiah Naidu Tour In Visakhapatnam Today

విశాఖ అగ్రిహ్యాక్‌థాన్‌లో మైక్రోసాఫ్ట్ కంపెనీ వ్యవస్థాపకులు బిల్ గేట్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. బిల్ గేట్స్ గా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విలియం హెన్రీ గేట్స్ సాఫ్ట్‌వేర్ దిగ్గజంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేతగా అందరికి సుపరిచితుడు.

అయితే ఇప్పడు ఆయన ఓ గొప్ప దాత. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న బిల్ గేట్స్ ఇప్పుడు ఛారిటీ కార్యక్రమాలకే అంకితమయ్యారు. ముప్పై సంవత్సరాల క్రితం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌ని స్థాపించి చరిత్రలో నిలిచిపోయిన బిల్‌గేట్స్ ఆ సంస్థ బాధ్యతలనుంచి 2008 జూన్ 28 న తప్పుకున్నారు. అప్పటి నుంచి తాను స్థాపించిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్‌కు పూర్తి సమయం వెచ్చిస్తూ విశ్వమానవ వికాసం కోసం కృషి చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
visakhapatnam: Vice-President M Venkaiah Naidu will tour in Visakha for two days from november 14. vice president will participate in Agri – Hackathon inagaration function. Microsoft co-founder Bill Gates and Chief Minister N. Chandrababu Naidu would attend on the second day. An exhibition would be organised on integrating modern technology and IT in agriculture.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి