• search
  • Live TV
నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెంకయ్య నాయుడు కొత్త చిరునామా ఇదే - రాజకీయంగా నెక్స్ట్..!!

|
Google Oneindia TeluguNews

వెంకయ్య నాయుడు. దాదాపుగా అయిదు శతాబ్దాల రాజకీయ జీవితం. ఏబీవీపీ కార్యకర్తగా మొదలు పెట్టి బీజేపీ వంటి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా..ఉప రాష్ట్రపతి వరకు ప్రస్థానం. వెంకయ్య ప్రసంగాలంటే సొంత పార్టీ వారే కాదు..ప్రతిపక్షాలు ఆసక్తిగా గమ నిస్తాయి. వెంకయ్య పంచ్ లు.. ప్రాస.. వ్యాక్చాతుర్యంతో అందరిలోనూ మంచి గుర్తింపు పొందారు. అదే విధంగా నిబద్దత కలిగిన పార్టీ కార్యకర్తగా ఒకే పార్టీలో తొలి నుంచి కొనసాగిన అరుదైన నేతగా నిలిచారు. ఇప్పటికీ రాజకీయంగా వెంకయ్య యాక్టివ్ గానే కనిపిస్తారు. ఉప రాష్ట్రపతిగా ..రాజ్యసభ ఛైర్మన్ గా సభా నిర్వహణ..సభ్యుల నియంత్రణలో పూర్తి పట్టు ఉన్న నేత. వెంకయ్య మరి కొద్ది రోజుల్లో మాజీ కాబోతున్నారు.

తెలుగు దనానికి చిరునామాగా

తెలుగు దనానికి చిరునామాగా


అయిదు సంవత్సరాల క్రితం అనూహ్య పరిస్థితుల్లో ఉప రాష్ట్రపతిగా నియమితులైన వెంకయ్య..నాడు రాజ్యసభలో బీజేసీ సంఖ్యా బలం తక్కువగా ఉండటం.. కీలక అంశాల కు ఆమోదం పొందటం అవసరం కావటంతో పాటుగా.. దక్షిణాదికి ప్రాధాన్యతలో భాగంగా.. పార్టీ సీనియర్ నేత వెంకయ్య కు అరుదైన పదవితో గుర్తింపు దక్కింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలే..ఈ ఉత్తమ పార్లమెంటేరియన్ కు దాదాపుగా చివరి సమావేశాలు. సమావేశాల మధ్యలోనే ఆగస్టు 10వ తేదీతో రాజ్యసభ ఛైర్మన్ గా.. ఉప రాష్ట్రపతిగా వెంకయ్య పదవీ కాలం ముగియనుంది. అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న థండక్ ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఖరారు చేసారు. దీంతో..ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వెంకయ్య భవిష్యత్ రాజకీయ అడుగుల పైన చర్చ మొదలైంది. మోదీ ప్రభుత్వంలో ఆయన పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రసారాలు తదితర శాఖలను నిర్వహించారు.

ఇక రాజకీయాలకు దూరంగా

ఇక రాజకీయాలకు దూరంగా

రాజ్యంగ పదవిలో ఉండటంతో ఆయన రాజకీయ ప్రసంగాలకు బ్రేక్ పడింది. ఉప రాష్ట్రపతి పదవి నిర్వహించిన తరువాత రాజకీయంగా తిరిగి యాక్టివ్ అయిన నేతలు ఎవరూ ఇప్పటి వరకు కనిపించలేదు. కానీ, వెంకయ్యకు రాజకీయంగా ఉండే ఆసక్తి తో ఆయన తన పదవీ విరమణ చేసిన తరువాత ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఉప రాష్ట్రపతి పదవి తరువాత రాష్టపతి పదవి. ఆ పదవికోసం ముర్మును ఎంపిక చేసారు. ఇక, ఉన్నత పదవులు వెంకయ్యకు దక్కేవి ఏవీ లేవనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో వెంకయ్య రాజకీయాలకు ఇక దూరం కావాల్సిందేనా అనేది తెలుగు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు కారణమవుతోంది. అయితే, ఇప్పటికే ఆయన కుటుంబం స్వర్ణ భారత్ ట్రస్టు ద్వారా సేవా రంగంలో ఉండటంతో..ఆయన సైతం అదే బాటలో ముందుకు వెళ్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దశాబ్దాల పాటు రాష్ట్ర, జాతీయ రాజకీయాలు నిర్వహించి, తెలుగు దనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలించిన వెంకయ్య ఇక రాజకీయంగా క్రియాశీలకంగా మారే అవకాశాలు కనిపించటం లేదు. ఇదే సమయంలో..ఉపరాష్ట్రపతి పదవి నుంచి పదవీ విరమణ చేసిన తరువాత వెంకయ్య కోసం కొత్త ఇంటిని కేటాయించారు.

వెంకయ్య కొత్త చిరునామా

వెంకయ్య కొత్త చిరునామా


ఇక నుంచి వెంకయ్య అడ్రస్ మారనుంది. ఢిల్లీలోని రాజ్‌దూత్‌ మార్గ్‌లో బంగళాకొద్ది రోజుల క్రితమే వెంకయ్యనాయుడుకు చాణక్యపురిలోని 1, రాజ్‌దూత్‌ మార్గ్‌లో బంగళాను కేటాయించారు, ఇప్పటికే ఆ బంగళాకు మరమ్మతులు పూర్తి చేయించారు. ఆగస్టు 10న పదవీవిరమణ చేసిన వెంటనే.. ఆయన ఆ ఇంటికి మారనున్నారు. అయితే, ఆయన సొంత రాష్ట్రం ఏపీ కాగా, ఆయనకు రాజకీయంగా మద్దతిచ్చిన రాష్ట్రం కర్ణాటక. పదవులు లేకపోయినా.. తెలుగు వ్యక్తిగా.. తెలుగు వాళ్లకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారని వెంకయ్య సన్నిహితులు చెబుతున్నారు. దీంతో..రాజకీయంగా హోరాహోరీగా మారుతున్న ఏపీలో ఆయన పాత్ర ఏమైనా ప్రత్యక్షంగా - పరోక్షంగా ఉంటుందా అనే చర్చ నడుమ ..పదవీ విరమణ తరువాత వెంకయ్య నాయుడు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ తో పాటుగా ఆయనతో పరిచయం ఉన్న అన్ని వర్గాల్లోనూ ఆసక్తి కర చర్చ సాగుతోంది.

English summary
Vice president Venkaiah Naidu Address change after his retirement from the post, new building allocatted for him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X