టీడీపీ కీలక నేతకు విడదల రజనీ మాస్ వార్నింగ్..!!
వైసీపీ మాజీ మంత్రి టీడీపీ మాజీ మంత్రికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. చిలకలూరి పేటలో కొద్ది రోజు లుకా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. తన కుటుంబం లక్ష్యంగా పుల్లారావు రాజకీయ వేధిం పులకు పాల్పడుతున్నారని విడదల రజనీ ఆరోపిస్తున్నారు. తనది పురుషోత్తపట్నం అని గుర్తు పెట్టుకోవాలని.. వదిలేది లేదని రజనీ వార్నింగ్ ఇచ్చారు. పుల్లారావు అక్రమాలు చేస్తున్నారని.. ఎక్కవ కాలం ఇవి కొనసాగించలేరని చెప్పుకొచ్చారు. తన పార్టీ.. తన కుటుంబం జోలికి వస్తే వదిల నని రజనీ హెచ్చరించారు.
రజనీ వార్నింగ్
వైసీపీ వర్సస్ టీడీపీ రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. చిలకలూరి పేటలో ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పైన వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన ఏడేళ్ల రాజకీయంతోనే 25 ఏళ్ల పుల్లారావు రాజకీయం తల దించుకునేలా చేసానని చెప్పుకొచ్చారు. తనది పురుషోత్తపట్నం అని గుర్తు చేసిన రజనీ.. పుల్లా రావు ఇదే రకంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేసారు. తాను అయిదేళ్లు చిలకలూరి పేట కు ఎమ్మెల్యేగా.. మంత్రిగా పని చేసానని చెప్పుకొచ్చారు. తానెప్పుడూ ఇలాంటి అరాచక పాలన ప్రోత్సహించలేదన్నారు.

అవినీతి - అక్రమాలు
తన కుటుంబ సభ్యులతో పాటుగా వైసీపీ కేడర్ పైన అక్రమ కేసులు పెట్టి.. భయపెట్టాలని చూస్తు న్నారని రజనీ మండిపడ్డారు. ఎవరిని వదిలిపెట్టమని..అందరి సంగతి తెలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. అక్రమ కేసులకు భయపడమని.. ప్రతీ కేసు బలంగా ఎదుర్కొంటామని రజనీ చెప్పారు. నియోజకవర్గంలో ఇక తాను మరింత బలంగా పని చేస్తానని ప్రకటించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని విమర్శించారు. వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్ల కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ టాక్స్ లో వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని రజనీ పేర్కొన్నారు. వైసీపీ శ్రేణులను హింసించాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ముదురుతున్న పోరు
టీడీపీ నేతలు జేబులు నింపుకోవటానికి అక్రమ సంపాదన కోసం దోపిడి చేస్తున్నారని రజనీ మంది పడ్డారు. తాజాగా జగన్ తిరిగి చిలకలూరిపేట బాధ్యతలను రజనీకి అప్పగించారు. 2024 ఎన్నికల సమయంలో రజనీకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కేటాయించారు. అక్కడ పోటీ చేసి ఓడిన రజనీకి తిరిగి 2019 లో గెలిచిన నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఖరారు చేసారు. అక్కడ గత ఎన్నికల్లో మాజీ మంత్రి పుల్లారావు గెలుపొందారు. కాగా, నియోజకవర్గంలో ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ పోరు తాజా వివాదాలతో మరింత ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పుడు రజనీ వార్నింగ్ పై పుల్లారావు ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి.












Click it and Unblock the Notifications