వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీసీటీవీ ఫుటేజ్ చూసిన ప్రకాశ్ రాజ్ - దాడి చేసిన విజువల్స్ ఉన్నాయి : వారం సమయం- వాట్ నెక్స్ట్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఎట్టకేలకు ప్రకాశ్ రాజ్ అనుకున్న విధంగా సీసీటీవీ ఫుటేజ్ చూసారు. కానీ, ఆయన చేతికి మాత్రం ఫుటేజ్ రాలేదు. పోలింగ్ రోజున తమ ప్యానల్ సభ్యుల పైన మోహన్ బాబు...నరేశ్ దాడి చేసారని ప్రకాశ్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఆ విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ లో ఉందని చెబుతున్నారు. దీని పైన సీసీటీవీ ఫుటేజ్ ను ఇవ్వాలని కోరుతూ ఎన్నికల అధికారికి లేఖ రాసారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ను తాము పరిశీలించామని అందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, మీరు అడిగితే సీసీ టీవీ ఫుటేజ్ అందజేస్తామని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ నేరుగా ఫుటేజ్ ఇవ్వటానికి తిరస్కరించారు.

సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన ప్రకాశ్ రాజ్

దీంతో..ప్రకాశ్ రాజ్ పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజ్ తో పాటుగా ఎన్నికల విజువల్స్ మొత్తం ఒక రూంలో ఉంచి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసులు రెండు ప్యానళ్లకు చెందిన వారు వస్తే ఇద్దరి సమక్షంలో ఫుటేజ్ చూపిస్తామని స్పష్టం చేసారు. ఇదే సమయంలో సీసీటీవీ ఫుటేజ్ చూసుకోవటానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని విష్ణు తిరుపతిలో స్పష్టం చేసారు. మా ఎన్నికలు ఎలా జరిగాయి అన్నదానిపై తనకి అనుమానాలు ఉన్నాయని ప్రకాశ్ రాజ్ సందేహం వ్యక్తం చేసారు.

మోహన్ బాబు..నరేశ్ తమ సభ్యులపై దాడి చేసారంటూ

మోహన్ బాబు..నరేశ్ తమ సభ్యులపై దాడి చేసారంటూ


ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయని.. వాటిని తమకు తెలపాలని అడుగుతునన్నారు. ఏం జరిగిందో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని ప్రకాశ్ రాజ్ అభిప్రాయ పడ్డారు. కానీ, ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ దానికి సహకరించటం లేదన్నారు. దీని కారణంగానే పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. తమ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యుల రాజీనామా లేఖలు త్వరలో విష్ణుకు చేరుతాయని స్పష్టం చేసారు. దీంతో..పోలీసులు సైతం పోలింగ్ జరిగిన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కు చేరుకున్నారు.

ఎన్నికల అధికారిపైన ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

ఎన్నికల అధికారిపైన ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

విష్ణు ప్యానల్ మొత్తం తిరుపతిలో ఉంది. దీంతో.. ప్రకాష్ రాజ్ తో పాటు ఆయన ప్యానల్ సభ్యులు శ్రీకాంత్, తనీష్ వంటివారు స్కూల్ దగ్గరకు చేరుకున్నారు.పోలీసులతో పాటు ప్రకాష్ రాజ్ బృందం సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన ఏడు కెమేరాల్లోని విజువల్స్ చూడాల్సిన అవసరం ఉందని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేసారు. తమకు విష్ణుతో సమస్య లేదని...ఎన్నికల నిర్వహణ పైన తమకు అభ్యంతరాలు ఉన్నాయని..అధికారితోనే సమస్య ఉందని చెప్పుకొచ్చారు.

ప్రకాశ్ రాజ్ నెక్స్ట్ స్టెప్ పైన ఉత్కంఠ

ప్రకాశ్ రాజ్ నెక్స్ట్ స్టెప్ పైన ఉత్కంఠ


వారం రోజుల్లోనే ఈ విజువల్స్..సీసీ కెమేరా ఫుటేజ్ విషయంలో స్పందిస్తానని స్పష్టం చేసారు. సీసీటీవీ ఫుటేజ్ చూడమని చెప్పిందనందుకు విష్ణుకు ప్రకాశ్ రాజ్ థాంక్స్ చెప్పారు. అయితే, ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ప్రకాశ్ రాజ్ ఎన్నికల నిర్వహణ పైన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని ప్రచారం సాగుతోంది. ప్రకాశ్ రాజ్ మాత్రం దీని పైన స్పష్టత ఇవ్వలేదు. విష్ణు ప్యానల్ ఏ రకంగా "మా" ను నిర్వహిస్తుందో చూస్తామని...అవసరమైతే ప్రశ్నిస్తామని వెల్లడించారు. దీంతో..ఇప్పుడు ప్రకాశ్ రాజ్ రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Prakash Raj came along with Police to Jubilee Hills Public School to take the MAA Election video footages.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X