Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో: భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా.. ప్లేయర్స్ లో జోష్, నగరిలో ఎమ్మెల్యే రోజా దూకుడు !!

నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఆమె ఏం చేసినా సంచలనమే. లాక్ డౌన్ సమయం లో కరోనా మహమ్మారి కట్టడికి విధులు నిర్వర్తించిన వారికి స్వయంగా వంట చేసి పెట్టిన రోజా , అప్పట్లో అంబులెన్సు నడిపిన రోజా, ఆ తర్వాత దిశ స్కూటర్లను నడిపి సందడి చేశారు. గతంలో డప్పు కళాకారులతో కలిసి డప్పు కొడుతూ ఎమ్మెల్యే రోజా అందరినీ ఆకట్టుకున్నారు. అదిరిపోయేలా డప్పుపై దరువేసి అందరిలో జోష్ నింపారు.

 రోజా చారిటబుల్ ట్రస్ట్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన రోజా దంపతులు ..

రోజా చారిటబుల్ ట్రస్ట్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన రోజా దంపతులు ..

ఇదిలా ఉంటే తాజాగా ఎమ్మెల్యే రోజా నగరి నియోజకవర్గం లో గ్రామీణ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించి గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించారు. భర్త సెల్వమణి తో కలిసి కబడ్డీ కబడ్డీ అంటూ కాసేపు కబడ్డీ కోర్టు లో కబడ్డీ ప్లేయర్ గా మారిపోయిన రోజా, రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే క్రీడా పోటీలలో భాగంగా స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తున్నారు. నవంబర్ 17వ తేదీన రోజా పుట్టిన రోజు సందర్భంగా నిర్వహిస్తున్న గ్రామీణ క్రీడా పోటీలను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఈనెల 15వ తేదీ వరకు కొనసాగే ఈ స్పోర్ట్స్ మీట్ ను రోజా దంపతులు ఇద్దరూ ప్రారంభించారు భార్యాభర్తలిద్దరూ సరదాగా కాసేపు కబడ్డీ ఆడారు.

సెల్వమణితో కలిసి రోజా సెల్వమణితో కలిసి రోజా కబడ్డీ .. క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన రోజాకబడ్డీ .. క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన రోజా

సెల్వమణితో కలిసి రోజా సెల్వమణితో కలిసి రోజా కబడ్డీ .. క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన రోజాకబడ్డీ .. క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన రోజా

ఇక కబడ్డీ కోర్టు లో కూత పెట్టిన రోజా భర్త సెల్వమణితో కబడ్డీ ఆడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నగరి నియోజకవర్గంలోని నగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రామీణ క్రీడా పోటీలలో పాల్గొన్న రోజా, కబడ్డీ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. ఆటల పట్ల ఎంతో ఆసక్తి కనబరిచే రోజా, రాజకీయాలలో ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ఆటవిడుపుగా ఆటలు ఆడుతుంటారు. గ్రామీణ క్రీడల పునరుత్తేజానికి అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చిన రోజా యువత ఖాళీ ఉన్నప్పుడల్లా కబడ్డీ ఆడాలని పేర్కొన్నారు.

గతంలో డప్పు కొట్టి స్టెప్పులేసిన రోజా

గతంలోనూ పుత్తూరు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో జరిగిన డప్పు కళాకారులకు పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రోజా డప్పు కళాకారులు అందరికీ డప్పులను అందించి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను ఆదరిస్తుంది అని స్పష్టం చేశారు. కులవృత్తులను, కళాకారులను ఆదుకోవడం కోసం జగన్ సర్కార్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందని పేర్కొన్నారు రోజా. ఇక తాజాగా రోజా గ్రామీణ క్రీడాకారులలో జోష్ నింపారు.

నియోజకవర్గంలో యాక్టివ్ గా రోజా

వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా నగరి నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలోని కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. తాజాగా రోజా పారిశుద్ద్యం పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించడం కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోజా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చెత్త మీద పన్ను పై ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో చెత్త పై పన్ను ఎందుకు వేశారో చెప్పారు నగరి ఎమ్మెల్యే రోజా.

పారిశుద్ధ్యంపై బాధ్యత పెంచటం కోసమే చెత్తపై పన్ను, జగనన్న స్వచ్చ సంకల్పంలో రోజా


పారిశుధ్యం పట్ల ప్రజల బాధ్యత పెంపొందించడం కోసమే చెత్త మీద పన్ను విధించారని నగరి ఎమ్మెల్యే రోజా తేల్చిచెప్పారు. పుత్తూరు మున్సిపాలిటీ 15 వ వార్డు లో జగన్ అన్న సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజా ప్రతిదీ ఫ్రీ అంటే ప్రజలు బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతోనే రోజుకో రూపాయి చొప్పున చెత్త పై పన్ను విధిస్తున్నారని వెల్లడించారు. ఇక దీనితో ప్రభుత్వం సంపాదించేదేమీ లేదని చెప్పిన రోజా ప్రతిపక్షాల నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. అందరి ఇల్లు, వీధులు, ఊళ్ళు శుభ్రంగా ఉంటేనే అందరూ ఆరోగ్యంతో జీవిస్తారని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.

పారిశుద్ధ్యంపై మాట్లాడిన రోజా.. ప్రజలకు చెత్తబుట్టల పంపిణీ


జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం గురించి వాలంటీర్లు, కార్యకర్తలు, ప్రజలకు అవగాహన కల్పించాలని రోజా పేర్కొన్నారు. ప్రజలంతా పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని, మహిళలు తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని రోజా సూచించారు. ప్రతి ఇంటికి మూడు చొప్పున చెత్త బుట్టలను ఇచ్చారు రోజా. 2 కోట్ల 36 లక్షల రూపాయల బడ్జెట్ తో క్లీన్ పుత్తూరు కు శ్రీకారం చుట్టారని పేర్కొన్న రోజా పుత్తూరు మునిసిపాలిటీని పరిశుభ్రమైన పుత్తూరుగా మార్చాలని రోజా పిలుపునిచ్చారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+