'వ్యాపారాలు ముఖ్యమనుకుంటే ఢిల్లీలోనే ఉండండి, గల్లీలోకొస్తే తరిమికొడతాం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు ప్రత్యేకహోదా తీసుకురాకుండా రాష్ట్రానికి వస్తే తరిమికొడతామని విద్యార్ధి జేఏసీ నేతలు హెచ్చరించారు. ఎంపీలు తమ వ్యాపారాలే ముఖ్యమనుకుంటే ఢిల్లీలోనే ఉండాలని, గల్లీలోకి వస్తే తరిమి తరిమి కొడతామన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్‌ను బీజేపీ ప్రభుత్వం అమలు చేయనందుకు నిరసనగా మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని విద్యార్ధి జేఏసీ నేతలు ముట్టడించారు. ఈ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది.

పలువురు జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విద్యార్ధి జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, లేదంటే రాజీనామా చేసి ప్రజలతో కలిసి ఉద్యమించాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభలో ఏపీకి పదేళ్లు ప్రత్యేకహోదా కావాలని కోరిన నాయకులు ఇప్పుడు మాట్లాడటం లేదన్నారు. ఎన్నికల సమయంలో పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ అధికారం చేపట్టగానే సెక్షన్ల పేరుతో కాలయాపన చేస్తోందని విద్యార్థి జేఏసీ నేతలు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications