గుంటూరులో విజిలెన్స్‌ దాడులు.. రూ.2కోట్ల విలువైన నకిలీ పురుగుమందులు స్వాధీనం

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

గుంటూరు: గుంటూరులో వ్యవసాయ అధికారులు ఎన్ని జగ్రత్తలు తీసుకున్నా నకిలి పురుగుమందుల జోరుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
గురువారం విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా నకిలి పురుగు మందులు పట్టుబడటం సంచలనం సృష్టించింది. అయితే వ్యవసాయ అధికారులకు వీటి గురించి తెలిసినా ముడుపుల కోసం సైలెంట్ గా ఉండిపోవడం వల్లే ఇంత భారీ ఎత్తున నకిలీ పురుగుమందులను దాచి ఉంచగలుగుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

Vigilance raids in Guntur... seized Rs. 2 Crores worth fake pesticides...

గుంటూరులోని లాంచెస్టర్‌ రోడ్డులో విజిలెన్స్‌ అధికారులు గురువారం జరిపిన దాడుల్లో 2 కోట్ల రూపాయల విలువచేసే నకిలి పురుగు మందులు పట్టుబడటం సంచలనం సృష్టించింది. విజిలెన్స్ అధికారులకు పక్కాగా అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించగా ఓ గౌడౌన్లో నిల్వ ఉంచిన రూ.2 కోట్ల విలువైన పురుగుమందుల నిల్వలు పట్టుబడ్డాయి. అయితే ఇవన్నీ కాలం చెల్లిన, అనుమతి లేని పురుగుల మందులని వీటిని ఇక్కడ దాచి ఉంచడం వెనుక ఖచ్చితంగా వీటిని అక్రమంగా విక్రయించేందుకేనని విజిలెన్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గౌడన్ యజమానిని విచారించిన అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rs. 2 Crores worth fake pesticides was unearthed in guntur city on thursday during the raids conducted by Vigilance officers on a gowdown.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి