‘పవన్ కళ్యాణ్ కట్టప్పను మించిపోయాడు! జైలుకు వెళ్తానని చంద్రబాబుకు ముందు తెలుసా?’
అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా ట్విట్టర్ వేదకిగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాల విషయాన్ని ప్రస్తావిస్తూ వీరిద్దరిపై మండిపడ్డారు.

జైలుకు వెళ్తానని చంద్రబాబుకు ముందు తెలుసు?
ఐటీ దాడులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని విజయసాయి రెడ్డి నిలదీశారు. ఎలక్షన్లలో గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పుకుంటారు ఎవరైనా. బాబు మాత్రం తన పరిస్థితిని ముందే అంచనా వేశాడంటూ ఆయన ఎద్దేవా చేశారు. ‘ఎన్నికల్లో ఓడితే జైలుకు పోతా. జైలుకు వెళ్లకుండా ఉండాలంటే నన్ను గెలిపించాలి. అరెస్టు చేయడానికి వస్తే మీరంతా వలయంలా నిల్చుని రక్షణ కల్పించాలి' అని చంద్రబాబు అప్పుడే తన భవిష్యవాణిని వినిపించాడని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు పత్తిగింజ అని..
‘చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా కిందా మీదా పడుతోంది. ఇన్ కంటాక్స్ కమిషనర్ సురభి అహ్లూవాలియాను కూడా దూషించే స్థాయికి వెళ్లి పోయింది. 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తే.. కాదు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టింది' అని విజయసాయి మండిపడ్డారు.

కట్టప్పను మించిన పవన్ కళ్యాణ్..
‘వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976 లోనే వచ్చినా ప్యాకేజీ స్టార్ లాంటి వాళ్లు బానిస సంకెళ్ల నుంచి బయటపడలేక పోతున్నారు. జనం నవ్వుకుంటారన్న ఇంగితం లేకుండా యజమానిని సమర్థిస్తున్నాడు. పిఎస్ శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదట. కట్టప్పను మించి పోయాడు!' అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు బ్యాచ్ కిక్కురమనడం లేదేం..
‘దొంగలను చూసి మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి. చంద్రబాబు ట్రెయినింగ్ అలాగే ఉంటుంది. దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు. అందరిపైనా వారే నిందలు మోపుతూ, చూశారా మేమొండిన పరమాన్నం ఇంకా చల్లారనే లేదని నీతి సూక్తులు వల్లిస్తుంటారు. ఏబీవీ సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. డిజిపి స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తారా అని గగ్గోలు పెట్టిన బాబు బ్యాచ్ కిక్కురుమనడం లేదు. ఎప్పటిలాగే ఎల్లో మీడియా తమ జాతి రత్నాన్ని వెనకేసుకొచ్చింది. స్టే దొరకలేదనే విషయాన్ని పత్రికల్లో చిన్నదిగా చేసి రాశాయి. బాబు మాజీ పిఎస్ శ్రీనివాస్ కమిట్ మెంటుని మెచ్చుకోవాలి. యజమాని ప్రతి లావాదేవీనీ డైరీలో రాసుకున్నాడు. కంప్యూటర్లో నిక్షిప్తం చేసాడు. ఇంకా అప్పగించాల్సిన పద్దులను అలాగే దాచి ఉంచాడు. దోచుకున్నవి, దొంగదారుల్లో పంపిన లెక్కలన్నిటినీ పర్ ఫెక్టుగా రికార్డు చేసాడు' అంటూ విజయసాయి ఇటీవల ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications