ఏందబ్బా.. మిక్సీలో వేసి రుబ్బినా సరిగా రాలేదా?
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సమంత నాయకా నాయికలుగా నటించిన లేటెస్ట్ మూవీ ఖుషీ. దర్శకుడు శివ నిర్వాణ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా నిర్మించారు. సెప్టెంబరు 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని గ్రాండ్ గా నిర్మించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. విజయ్ గత చిత్రం లైగర్ నిరాశపరచడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈసారి ఖుషీ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఖుషీ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది. యుఏ సర్టిఫికెట్ ఇచ్చారు. 165 నిముషాల నిడివితో ప్రేక్షలకు ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధంగా ఉంనదని నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమా రన్ టైం బయటకు వచ్చిన తర్వాత అభిమానులు కంగారుపడుతున్నారు. రెండు గంటల 45 నిముషాలపాటు సినిమాను నడిపించడం అంటే మాటలు కాదని, ఏమాత్రం తేడా కొట్టినా రన్ టైమ్ సినిమాకు సమస్యగా మారుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా సినిమాలు రన్ టైమ్ ఎక్కువగా ఉండటంతోనే భారీ విజయాలను అందుకోలేకపోయాయని గుర్తుచేస్తున్నారు.

చాలా సినిమాలు రన్ టైమ్ తక్కువగా ఉండటంతో భారీ సక్సెస్ ను సాధించాయని చెబుతున్నారు. ఖుషీ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుందా అంటు కంగారు పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథను దేశముదురు, అంటే సుందరానికి, గోత గోవిందం కథలను మిక్సీలో వేసి రుబ్బి ఖుషీని తయారుచేశారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై వస్తున్న విమర్శలకు చిత్ర యూనిట్ ఇంకా సమాధానం ఇవ్వలేదు. దీనికితోడు రన్ టైమ్ ఎక్కువగా ఉండటంతో విజయ్ అభిమానులు కంగారుపడుతున్నారు.












Click it and Unblock the Notifications