మంత్రి దానంపై పిజెఆర్ తనయ విజయారెడ్డి ఫిర్యాదు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గంలో తనను ప్రచారం చేయకుండా మంత్రి దానం నాగేందర్ అనుచరులు అడ్డుకుంటున్నారని ఎన్నికల సంఘానికి పీజేఆర్ కూతురు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయారెడ్డి ఫిర్యాదు చేశారు.
దానం అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దానం నాగేందర్‌కు ఓటమి భయం పట్టుకుందని విజయారెడ్డి అన్నారు. పీజేఆర్ పేరు చెప్పుకుని పదవులు సంపాదించిన దానంకు వచ్చే ఎన్నికల్లో జనం బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

బంజారాహిల్స్ డివిజన్ నందినగర్ పక్కనేఉన్న వెంకటేశ్వరనగర్‌లో ఆదివారం పాదయాత్ర చేపట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ కన్వీనర్ విజయారెడ్డిపై దానం అనుచరులు దౌర్జన్యానికి దిగారు.
తమ నేత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను తిరగనివ్వద్దని చెప్పారని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని దానం అనుచరులు అన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications