చంద్రబాబు ద్వంద వైఖరి, బాబు సీఎం అయ్యాక రూ.లక్ష కోట్ల అప్పులు: విజయసాయి
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి విషయంలోను ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి బుధవారం విమర్శించారు.
కేంద్రం కట్టవలసిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కోరితేనే రాష్ట్రానికి అప్పగించామని చెబుతున్నారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ అప్పులు రూ.లక్ష కోట్లకు పెరిగాయని ధ్వజమెత్తారు.

కాగా, ఎన్నికలు సమీపిస్తున్నందుకే టీడీపీ, వైసీపీలు రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా అవిశ్వాస తీర్మానం పెడుతున్నాయని బీజేపీ ఏపీ ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే ఏపీకి చేసిన మేలు వివరించేందుకు తాము సిద్ధమని అన్నారు.












Click it and Unblock the Notifications