వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం కంటే ఏపీ ఆర్దిక స్థితి మెరుగ్గా - వాటా సరిగ్గా ఇవ్వటం లేదు: ఎంపీ సాయిరెడ్డి..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ ఆర్దిక పరిస్థితిపై కేంద్రం ఈ మధ్య కాలంలో చేస్తున్న వ్యాఖ్యలకు ఎంపీ సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీ ఆర్దిక పరిస్థితిని కేంద్రంతో పోల్చుతూ లెక్కలు బయట పెట్టారు. కేంద్రంతో పోల్చితే ఏపీలో ఆర్దిక పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పుకొచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోల్చినా ఏపీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందన్నారు.కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా సరిగా ఇవ్వడం లేదని విజయసాయి ఆరోపించారు. వృద్ధి రేటులో ఇతర రాష్ట్రాల అప్పులతో పోలిస్తే ఏపీ ఐదో స్థానంలో ఉందన్నారు.

కేంద్రం వాదనకు కౌంటర్ గా

కేంద్రం వాదనకు కౌంటర్ గా

కొద్ది రోజుల క్రితం శ్రీలంక సంక్షోభం పైన కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమయంలో రాష్ట్రాల అప్పుల గురించి ప్రస్తావిస్తూ..ఏపీ గురించి కేంద్రం వివరించింది. దీని పైన అప్పుడే వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. అయితే, రాజకీయాలతో సంబంధం లేదని.. ఉన్న పరిస్థితులు వివరించామని కేంద్రం వివరణ ఇచ్చింది. ఇప్పుడు సాయిరెడ్డి ఆ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రాల గురించి చెప్పుకొచ్చిన కేంద్రం.. తమ పరిస్థితులను వివరించలేదని వ్యాఖ్యానించారు.

కేంద్రం కంటే మెరుగ్గానే

కేంద్రం కంటే మెరుగ్గానే


2021-22 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ అప్పులు - జీడీపీ నిష్ఫత్తి 57 శాతం ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో అది 32.4 శాతమే ఉందన్నారు. రుణాలు - జీఎస్డీపీ నిష్ఫత్తిలో ఏపీ అయిదో స్థానంలో ఉందదని సాయిరెడ్డి వివరించారు. రాష్ట్ర రెవిన్యూ లోటు రూ 8,500 కోట్లు, ద్రవ్య లోటు రూ 25,194 కోట్లుగా ఉందని లెక్కలు చెప్పుకొచ్చారు. ఇక, పన్నుల వాటాగా కేంద్రం ఇస్తున్నామని చెబుతున్న 41 శాతం లెక్కల ప్రకారం 2015-16 సంవత్సరంలో కేంద్రానికి రూ 14.5 లక్షల కోట్ల ఆదాయం వస్తే..34.91 శాతం మాత్రమే రాష్ట్రాలకు వాటాగా ఇచ్చారని వివరించారు.

రాష్ట్రాలకు అందులో వాటా ఇవ్వాలి

రాష్ట్రాలకు అందులో వాటా ఇవ్వాలి

ఇందులో ఏపీకి 1.50 శాతమే దక్కిందన్నారు. ఇక, సెస్సులు..సర్ ఛార్జ్ ల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తే కేంద్రం నుంచి అయిదేళ్ల కాలంలో ఏపీకి దాదాపుగా రూ 50 వేల కోట్లు వచ్చి ఉండాల్సిందని సాయిరెడ్డి విశ్లేషించారు. కేంద్రం వసూలు చేసే సెస్ సర్ ఛార్జీల్లోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని విజయ సాయిరెడ్డి డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం పార్లమెంట్ కేంద్ర ఆర్దిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని రాష్ట్రాల రుణాల మొత్తాలను వెల్లడించారు. ఆ లెక్కలతో ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వం పైన చేస్తున్న విమర్శలు నిజం కాదని తేలిందంటూ ఆర్దిక మంత్రి బుగ్గన క్లారిటీ ఇచ్చారు.

English summary
YSRCP Parliamentary leader Vijaya Sai Reddy compared Central and Sate Financial status, demanded for share in cess and surcharges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X