అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరి ఇది తెలుసా: కోడెలకు విజయసాయి రెడ్డి కౌంటర్, 'అసెంబ్లీకి పదేపదే పిలవకండి'

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో తనకు తెలియదని, తాను ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని, కానీ మాట్లాడేందుకు ఆయన అవకాశమివ్వడం లేదని స్పీకర్ కోడల శివప్రసాద రావు చెప్పారు. దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

సునీతకు భారీ షాక్.. పరిటాల రవి కీలక అనుచరుడి తిరుగుబాటు: వైసీపీలోకి, ఎందుకంటే?సునీతకు భారీ షాక్.. పరిటాల రవి కీలక అనుచరుడి తిరుగుబాటు: వైసీపీలోకి, ఎందుకంటే?

మరి ఇది తెలుసా?

మరి ఇది తెలుసా?

ఈ మేరకు విజయసాయి రెడ్డి ఓ పోస్ట్ చేశారు. ప్రతిపక్షం అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో తనకు తెలియదని కోడెల చెప్పగా.. దానికి విజయసాయి రెడ్డి సైరాపంచ్ పేరుతో కౌంటర్ ఇచ్చారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొని, నలుగురిని మంత్రులుగా చేశారనే విషయం తెలుసా? ఇలా విచ్చలవిడిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా చర్యలు ఎందుకు తీసుకోలేదని పేర్కొంటూ పార్టీ మారిన 23 మంది ఫోటోలు పెట్టారు.

 ఈ కార్లలో తిరగండి

ఈ కార్లలో తిరగండి

కియా కారులో ప్రయాణం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గట్టి కౌంటర్ ఇచ్చారు. 'మంచిది.. తమరు అధికారం వెలగబెట్టే ఈ రెండు నెలలు ప్రత్యేక విమానాల జల్సాలు ఆపి ఈ కార్లలోనే తిరగండి' అని పేర్కొన్నారు.

టీడీపీ రియల్ వ్యాపారం కోసమే

టీడీపీ రియల్ వ్యాపారం కోసమే

కియా కార్ల ఫ్యాక్టరీ టీడీపీ ఎమ్మెల్యేల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే ఉపయోగపడిందని, కియాలో యువతకు దక్కింది చిన్నపాటి జాబులు మాత్రమేనని, కంపెనీ భూముల వివరాలను ముందే సంపాదించి చుట్టుపక్కల రైతులను బెదిరించి వేల ఎకరాలను కారు చౌకగా కొట్టేశారని, వందల కోట్లు వెనుకేసుకున్నారని ఆరోపించారు. పేదలకు కనీస ఆదాయ భరోసా హామీ ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పైన కూడా విజయసాయి రెడ్డి కౌంటర్ వేశారు. కాంగ్రెస్ పార్టీ గరీబీ హఠావో అని నినాదం ఇచ్చి 40 ఏళ్లయిందని, కానీ దేశంలో పేదరికం ఇంకా అలాగే ఉందన్నారు.

ఆ తర్వాతే అసెంబ్లీకి వస్తాం

ఆ తర్వాతే అసెంబ్లీకి వస్తాం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వేరుగా స్పందిస్తూ... తమను (వైసీపీ ఎమ్మెల్యేలను) పదేపదే అసెంబ్లీకి పిలవాల్సిన అవసరం లేదని చెప్పారు. తమ పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన 23 మందిపై చర్యలు తీసుకున్న తర్వాతనే తాము అసెంబ్లీకి వస్తామని తేల్చి చెప్పారు.

English summary
YSR Congress Party Rajya Sabha member Vijaya Sai Reddy counter to Speaker Kodela Siva Prasada Rao on YSRCP absent to Andhra Pradesh assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X