అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రతిపక్షాలు మాత్రమే టార్గెట్‌ - వాళ్లను టచ్ చేయవద్దు : సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికల్లొ మరోసారి అధికారంలోకి వచ్చేది వైసీపీనేని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. వైసీపీ అధికారంలోకి రావటానికి సోషల్ మీడియా కార్యర్తల పాత్రను ఆయన అభినందించారు. పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్ గా నియమితులైన తరువాత అన్ని విభాగాలతో వరుసగా విజయ సాయిరెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోషల్ మీడియా విభాగంతో సమావేశమైన సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కొంత మంది సేవలను మరింత విస్తృతంగా వినియోగించుకుంటామన్నారు.

వైసీపీదే మళ్ళీ అధికారం

వైసీపీదే మళ్ళీ అధికారం

సీఎం జగన్‌ చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల 2024లోనూ వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్‌ తనను ఆదేశించారన్నారు. సోషల్‌ మీడియా కార్యకర్తలు ఏ విధంగా పార్టీకి సేవకులో.. తానూ అదే విధంగా పార్టీకి సేవకుడినేనని స్పష్టం చేశారు. ప్రతి మండలానికి, నియోజకవర్గానికి, పార్ల్లమెంట్‌ నియోజకవర్గానికి సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ను నియమిస్తామని వెల్లడించారు.

టీడీపీ లక్ష్యంగా పని చేయాలి

టీడీపీ లక్ష్యంగా పని చేయాలి

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్‌ మీడియా కార్యకర్తలు చురుగ్గా వ్యవహరించి, టీడీపీ అన్యాయాలను, చంద్రబాబు దురాగతాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి పార్టీని ప్రజలకు చేరువ చేశారు. వీరి కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందిస్తాం. పార్టీ కార్యకర్తల తరహాలోనే సోషల్‌ మీడియా కార్యకర్తలకు సభ్యత్వ కార్డులు ఇస్తామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ సభ్యత్వ నమోదు సాధారణ స్థాయిలో జరిగింది. ఇప్పుడు ఇతర పార్టీల కంటే అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయాలని చెప్పారు. జూలై 8న వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియా ద్వారా ప్రజాస్వామ్య పద్దతిలోనే పోరాటం సాగించాలని సూచించారు.

వారికి గురించి అవసరం లేదు

వారికి గురించి అవసరం లేదు

వ్యక్తిగత దూషణలు వద్దని చెప్పారు. కార్యకర్తలకు మరింత సమయం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను టార్గెట్‌ చేయాలే కానీ ఎగ్జిక్యూటివ్స్‌ను, జ్యూడిషియరీని టచ్‌ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసారు. అలాంటప్పుడు సోషల్‌ మీడియా కార్యకర్తలపై ఎవ్వరూ కేసులు పెట్టే అవకాశం ఉండదని సభ్యత్వం తీసుకున్న వారికి బీమా కల్పించే అంశంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సాయిరెడ్డి హామీ ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో హెల్ప్‌ లైన్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కార్యకర్తలకు ఏ సహాయం కావాలన్నా చేస్తామని సాయిరెడ్డి స్పష్టం చేసారు.

English summary
YSRCP Praliamentary leader Vijaya Sai Reddy key directions for party social media volunteers on coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X