మొదట సుజననే పెట్టారు!: మోడీ కాళ్లకు నమస్కారంపై విజయసాయి, తోక ఛానల్స్

Recommended Video

    వైసీపీ ద్వంద్వ నీతా? విజయసాయి మోడీ కాళ్లకు మొక్కలేదా ?

    అమరావతి/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ సాయి రెడ్డి మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు, టీడీపీ నేతలు తనను పదేపదే టార్గెట్ చేసుకోవడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

    ఎవరైతే తల్లిదండ్రులకు పుడతారో అలాంటి వారు తనపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయరని ఘాటుగా మాట్లాడారు. అదే సమయంలో రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు మొక్కారన్న వ్యాఖ్యల పైన కూడా స్పందించారు. టీడీపీని కడిగిపారేశారు.

     చంద్రబాబు ఎదురుపడితే నమస్కరిస్తా

    చంద్రబాబు ఎదురుపడితే నమస్కరిస్తా

    తాను చంద్రబాబును ఓ వ్యక్తిగా కాకుండా, ఏపీ ముఖ్యమంత్రిగా చూస్తానని, ఆయన ఎదురుపడ్డా నమస్కరిస్తానని విజయ సాయి రెడ్డి అన్నారు. నమస్కారం చేస్తే ప్రతినమస్కారం పెట్టే సంస్కృతి మనది అన్నారు. చంద్రబాబుకు మాత్రం ఆ సంస్కారం లేదన్నారు. తనకు బద్ద వ్యతిరేకి అయినప్పటికీ చంద్రబాబు కనిపిస్తే సీఎం కాబట్టి నమస్కరిస్తానని చెప్పారు.

    సుజనా చౌదరి మొదట మోడీకి నమస్కరించారు

    సుజనా చౌదరి మొదట మోడీకి నమస్కరించారు

    అదే సమయంలో రాజ్యసభలో ప్రధాని మోడీ కాళ్లకు నమస్కారంపై విజయ సాయి రెడ్డి స్పందిస్తూ.. అసలు తనకంటే ముందు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి వెళ్లి మోడీకి నమస్కరించారని ధీటుగా కౌంటర్ ఇచ్చారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం ఉన్న వ్యక్తి ప్రధాని మోడీ అన్నారు. తమ పార్టీ భారతీయ సంస్కృతిని బాగా నమ్మే పార్టీ అన్నారు.

    చంద్రబాబు తోక ఛానల్స్ కుట్ర

    చంద్రబాబు తోక ఛానల్స్ కుట్ర

    ఆ తర్వాత తనకు కూడా ప్రధాని మోడీ ఎదురుపడ్డారని, తాను నమస్కరించానని విజయ సాయి రెడ్డి చెప్పారు. కులాసాగా ఉన్నారా అని అడిగారని చెప్పారు. వారు కూడా పెట్టారని, కానీ తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తారా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు తోక పార్టీలు, తోక ఛానల్స్ ఈ కుట్రలు చేశాయన్నారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కృతి చంద్రబాబు ఒక్కడికే లేదన్నారు.

     వారి విజ్ఞతకే వదిలేస్తున్నా

    వారి విజ్ఞతకే వదిలేస్తున్నా

    చంద్రబాబు కుసంస్కారి కాబట్టి తనపై ఇష్టారీతిన ఆరోపణలు చేశారని విజయ సాయి రెడ్డి విమర్శించారు. తాను పాదాభివనందనం చేసినట్లుగా వచ్చి నవార్తలపై వివరణ ఇచ్చారు. తనపై విమర్శలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. కాగా, విజయసాయి రెడ్డి నమస్కరించగా, మోడీ ప్రతి నమస్కారం చేశారు. ఆ తర్వాత విజయ సాయి రెడ్డి మోడీ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. మోడీ ఆయనను ఆశీర్వదిస్తూ భుజంపై చెయ్యి వేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+