జగన్ చెప్పిందిదే, కొనసాగలేను- కీలక అంశాలు వెల్లడించిన సాయిరెడ్డి..!!

విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. రాజీనామా పై ఆరా తీసిన ఛైర్మన్ ఆ వెంటనే రాజీనామా ఆమోదించారు. తన నిర్ణయం వెనుక కారణాలను సాయిరెడ్డి వెల్లడించారు. తన నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని పేర్కొన్నారు. తన రాజీనామాతో కూటమికే లబ్ది జరుగుతుందని చెప్పుకొచ్చారు. తన లాంటి వారు ఎంతమంది వెళ్లినా జగన్ కు నష్టం లేదేన్నారు. తాను ఏ పార్టీలో చేరటం లేదని సాయిరెడ్డి స్పష్టం చేసారు.

రాజీనామా ఆమోదం
విజయ సాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. రాజకీయాల నుంచి వైదొలగాల ని నిర్ణయించిన సాయిరెడ్డి ఇప్పటికే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ రోజు రాజ్యసభ ఛైర్మన్ ను కలిసి తన రాజీనామా లేఖ అందించారు. ఛైర్మన్ సైతం కారణాలను ఆరా తీసారు. వ్యక్తిగత కారణా లతో రాజీనామా చేస్తున్నట్లు సాయిరెడ్డి చెప్పటంతో ఛైర్మన్ వెంటనే ఆమోదించారు. తన నిర్ణయం వెనుక ఆసక్తికర అంశాలను సాయిరెడ్డి వెల్లడించారు. తన నిర్ణయం పైన జగన్ తో చర్చించానని చెప్పుకొచ్చారు. ఏ ఇబ్బంది వచ్చినా తనతో పాటుగా పార్టీ అండగా ఉంటుందని జగన్ చెప్పారని.. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో తాను కొనసాగలేనని చెప్పానని వెల్లడించారు.

Vijaya Sai Reddy reveals the reasons behind his decision and Jagan Response on his resignation

కూటమికే లాభం
తన రాజీనామాతో కూటమికే లాభం జరుగుతుందని చెప్పుకొచ్చారు. వైసీపీకి తన స్థానంలో ఎవరికీ అవకాశం ఉండదన్నారు. తన నిర్ణయం వెనుక ఎవరూ లేని స్పష్టం చేసారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ.. ఇప్పటికీ చాలా తేడా ఉందని చెప్పారు. రాజకీయాల నుంచి వైదొలగితే తాను ఇంకా బలహీనుడినవుతాను.. తప్ప బలవంతుడిని కానని సాయిరెడ్డి పేర్కొన్నారు. అలాంటప్పుడు కేసులు ఎలా తప్పిస్తారని ప్రశ్నించారు. ఎలాంటి ఆశలు, కేసు మాఫీలు తను ఆశించలేదని విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. తన లాంటి వాళ్లు ఎంత మంది వెళ్లినా జగన్ కు నష్టం లేదని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

రాజకీయాలకు దూరం
భవిష్యత్‌లో రాజకీయాల గురించి మాట్లాడనని ప్రకటించారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అప్రూవర్‌గా మారలేదన్నారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవని వెల్లడించారు. తన బంధువుల వ్యాపారాల్లో తన ప్రమేయం లేదన్నారు. తాను ఇప్పటికే పెట్టిన కేసులు కొనసాగుతాయ ని వివరించారు. తనకు చంద్రబాబుతో వ్యక్తిగతంగా విభేదాలు లేవని చెప్పారు. పవన్ తో చెన్నై లో ఉన్న సమయం నుంచి సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వైసీపీలో తన స్థానం తనదే నని.. ఎవరితోనూ విభేదాలు లేవని సాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక, తాను ఏ పార్టీలో చేరనని మరో సారి స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+