వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు అంతు చూస్తామని చిటికెలేస్తాడు.. లోకేశం విందు భోజనాలు ఆరగించి వస్తాడు : సాయిరెడ్డి వ్యంగ్యం

|
Google Oneindia TeluguNews

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోమారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబు చెప్పే డైలాగ్ లన్నిటిని, వరుసగా చెప్పి చంద్రబాబు పై సెటైర్ వేశారు. ఇదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను టార్గెట్ చేశారు.

మా ప్రభుత్వం రాగానే అంతకంత చూపిస్తాం అంటాడు బాబు

మా ప్రభుత్వం రాగానే అంతకంత చూపిస్తాం అంటాడు బాబు

తాజాగా చట్టం చేతికి చిక్కిన తన దొంగల ముఠా సభ్యులను వెనకేసుకు వస్తూ ప్రభుత్వంపై బాబు ఏమని పడతాడో తెలియంది కాదు అంటూ విమర్శనాస్త్రాలు సంధించిన విజయసాయిరెడ్డి కక్షపూరిత అరెస్టులని, అన్ని రాసి పెట్టుకున్నామని, మా ప్రభుత్వం రాగానే అంతకు అంతా చూపిస్తామని చిటికలేస్తాడు చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు. ఇక పరామర్శ పేరుతో లోకేశం విందు భోజనాలు ఆరగించి వస్తాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అమరావతి నిర్మాణం విషయంలో సైరా పంచ్ వేసిన సాయి రెడ్డి

అమరావతి నిర్మాణం విషయంలో సైరా పంచ్ వేసిన సాయి రెడ్డి

అంతేకాదు రాజధాని అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు కావాలని తనపై ఆరోపణలు చేశారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సైరా పంచ్ వేశారు విజయసాయిరెడ్డి. ఒక్క నిజం... నీ నోటితో ఒకే ఒక్క నిజం చెప్పు అంటూ చంద్రబాబుని అడుగుతున్నట్టు ఓ పోస్టర్ ని పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి, సారీ నాకు మునిశాపం నేను నిజం చెప్పకూడదు అంటూ చంద్రబాబు చెప్పినట్లుగా పోస్ట్ చేశారు. ఇప్పటికే అనేక సార్లు చంద్రబాబు ఎప్పుడూ అబద్దాలాడతారని సాయి రెడ్డి ఫైర్ అయిన విషయం తెలిసిందే.

రైతు ద్రోహి అంటూ రాయల సీమ కృష్ణా జలాల విషయంలో ఫైర్

రైతు ద్రోహి అంటూ రాయల సీమ కృష్ణా జలాల విషయంలో ఫైర్


ఇక రాయలసీమ కృష్ణా జలాల వివాదంపై మరో పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి రాయలసీమకు కృష్ణా జలాలు ఎలా తరలిస్తారని తెలంగాణా వాదనను సమర్ధించేలా తన ఎమ్మెల్యేలతో ఫిర్యాదు చేయించిన చంద్రబాబు ఇప్పుడేమంటారో చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణానదిపై ఉన్న అన్ని రిజర్వాయర్ నుండి వందల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలవాలని కోరుకున్నట్టే కదా ఈ రైతు ద్రోహి అంటూ చంద్రబాబుని టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు విజయసాయిరెడ్డి.

 పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రంలోని చిన్న పరిశ్రమల కోసం మాట్లాడిన సాయిరెడ్డి

పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రంలోని చిన్న పరిశ్రమల కోసం మాట్లాడిన సాయిరెడ్డి

ఒక పార్లమెంటు సమావేశాలలో పాల్గొంటున్న విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఏపీ ప్రభుత్వ ప్రయోజనాల కోసం తాము చేస్తున్న పోరాటాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూనే చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. ఈరోజు రాజ్యసభలో ఇన్సాల్వెన్సీ , దివాలా కోడ్ సవరణ బిల్లు 2021 పై జరిగిన చర్చలో పాల్గొని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి పలు సూచనలు చేశానని, రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వాలని కోరానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

 ఏపీలో గర్భిణీలకు వ్యాక్సినేషన్ ... దేశంలో రెండవ స్థానం అంటూ సాయిరెడ్డి ట్వీట్

ఏపీలో గర్భిణీలకు వ్యాక్సినేషన్ ... దేశంలో రెండవ స్థానం అంటూ సాయిరెడ్డి ట్వీట్


ఇక ఏపీలో ప్రభుత్వం గర్భిణులకు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రత్యేక దృష్టి సారించిందని మరో పోస్ట్ చేసిన విజయసాయిరెడ్డి, జూలై 30 రాత్రి కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం 34, 228 మంది గర్భిణీలకు వ్యాక్సిన్ వేసి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో సమర్థంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్రంలో కొనసాగుతుందని విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను చెప్తూనే, ప్రతిపక్షాల పై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి చంద్రబాబును వదలకుండా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక లోకేష్ పైన కూడా సాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తూనే ఉన్నారు.

English summary
Vijayasai reddy, who has been criticized for not knowing what he is going to do to the government by backtracking on his gang members who have recently fallen into cases, said that the arrests were partisan and that all had been written down and that Chandrababu would pinch that he would show everything when our government came. The irony is that Lokesham comes to lunch in the name of consoling tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X