ఎంపీ సాయిరెడ్డి థ్రిల్లింగ్ ఫీట్ - సముద్రంలో స్కూబా డైవింగ్ : వీడియో వైరల్..!!
వైసీపీ ముఖ్య నేత.. రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి రాజకీయలను పక్కన పెట్టారు. నిత్యం ఢిల్లీ - విశాఖ- అమరావతి వ్యవహారాల్లో బిజీగా ఉండే సాయిరెడ్డి ఇప్పుడు సడన్ గా సముద్ర గర్భంలో కనిపించారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఆయనతోనే ఉన్న సాయిరెడ్డి.. ఇప్పుడు అండమాన్ దీవులకు వెళ్లారు. అక్కడ నిత్యం ఉండే టెన్షన్ల నుంచి రిలీఫ్ కోసం చాలామంది స్కూబా డైవింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంపీ సాయిరెడ్డి సైతం అదే చేసారు.
సముద్రంలో 12 మీటర్ల లోతున
సముద్ర గర్బంలో అందాలను ఆస్వాదించారు. ఆయన స్కూబా డైవింగ్ వీడియో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసారు. అండమాన్ సముద్రంలో సాయిరెడ్డి స్కూబా డైవింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ సమయంలో తన ఫీలింగ్స్ గురించి సాయిరెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్టు చేసారు. అందులో..."అండమాన్ సముద్రంలో 12 మీటర్ల లోతైన నీటిలో స్కూబా డైవింగ్ చేయడం థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. లోతైన జీవితాన్ని చూడటం పూర్తిగా అద్భుతంగా ఉందని చెప్పారు.

మాయాజాలంతో ఆశ్చర్యం
సముద్రంలో అందమైన జీవితం మాయాజాలంతో తాను ఆశ్చర్యపోయానని.." సాయిరెడ్డి పేర్కొన్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయ సాయిరెడ్డి ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వం పైన చేసే విమర్శలకు కౌంటర్లు ఇస్తూ ఉంటారు. ప్రధానంగా చంద్రబాబు - లోకేష్ పైన విమర్శలు చేస్తారు. ఇక, విశాఖలో సాయిరెడ్డి గత ఎన్నికల సమయం నుంచి ఎక్కువగా ఫోకస్ పెట్టారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనే ఆలోచన.. అక్కడ పార్టీ పరంగా బాధ్యతలు సాయిరెడ్డి నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోనూ అటు కేంద్ర మంత్రులు..ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంధాన కర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో సాయిరెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక, ఇప్పుడు సాయిరెడ్డి స్కూబా డైవింగ్ వీడియో వైరల్ అవుతోంది.
It was completely amazing learning experience in the Andaman Sea watching the life 12 metres inside deep water. Scuba Diving today 6th January 2022 in the sea was thrilling as I was awestruck with the magic of beautiful life in the sea. pic.twitter.com/fCQ5ABSAzV
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 6, 2022












Click it and Unblock the Notifications