tdp chandrababu lokesh atchannaidu bjp janasena drama pawan kalyan somu veerraju టిడిపి చంద్రబాబు లోకేష్ అచ్చెన్నాయుడు బిజెపి జనసేన డ్రామా పవన్ కళ్యాణ్ సోము వీర్రాజు politics
ఆ పార్టీలది ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. తండ్రీ కొడుకుల ధృతరాష్ట్ర కౌగిలిలో టీడీపీ : సాయిరెడ్డి సెన్సేషన్
తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు . అటు చంద్రబాబును, లోకేష్ ను మాత్రమే కాకుండా, అచ్చెన్నాయుడు ను సైతం వదలకుండా విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్నటికి నిన్న టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిడిపి అంతర్ధాన దినోత్సవం అంటూ షాకింగ్ ట్వీట్ చేసిన విజయ సాయి రెడ్డి తాజాగా పచ్చ పార్టీ కి కొత్త నాయకత్వం వచ్చేది ఎప్పుడు బుచ్చన్నా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే చంద్రబాబు సమాధి చేశాడు
తండ్రి కొడుకుల ధృతరాష్ట్ర కౌగిలి నుండి ఆ పార్టీ బయటపడేది ఎప్పుడు? అని ప్రశ్నించిన విజయ సాయి రెడ్డి త్వరలోనే చీలికలు పీలికలు అయ్యి ఎవరి ముక్క వాళ్ళు లాక్కెళ్తారని సూటిగా చెప్పొచ్చుగా అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు నూతన నాయకులు రావడానికి ఏ మిగిలిందని, ఎన్టీఆర్ స్థాపిస్తే చంద్రబాబు సమాధి చేశాడు పార్టీని అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక ఈ వ్యాఖ్యలు గోరంట్ల జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం పని చెయ్యాలి అని చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో గోరంట్ల వ్యాఖ్యలకు కౌంటర్ గా అన్నారు .

నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకో అచ్చన్నా ... తర్వాత వాలంటీర్ల కథ చూద్దువు గానీ
అంతేకాదు ఇక అచ్చెన్నాయుడును టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ముందు నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకో అచ్చన్నా ... తర్వాత వాలంటీర్ల కథ చూద్దువు గానీ ... వారు చేస్తున్నది గొప్ప సేవ . వారేమైనా మీ జన్మభూమి కమిటీ సభ్యులు అనుకున్నావా ? మండల ఆఫీసులో కూర్చుని మెసేయడానికి .. వాలంటీర్ వ్యవస్థ దండగో... పండగో జనం చెప్తారులే అంటూ వాలంటీర్ల పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి.

వాలంటీర్ ల గుట్టు రట్టు చెయ్యాలన్న అచ్చెన్న వ్యాఖ్యలకు కౌంటర్
నిన్నటికి నిన్న అచ్చెన్నాయుడు వాలంటీర్లు వైసీపీకి ఓటు వేయకుంటే ప్రభుత్వ పథకాలు రావని బెదిరింపులకు గురి చేస్తే అలాంటివారిని ఆధారాలతో సహా టిడిపి వాట్సాప్ నెంబర్ కు పంపించాలని, అలా పంపించిన వారి ఖాతాలో పది వేల రూపాయల నగదు వేస్తామని ప్రకటించారు. గత ఎన్నికల్లో కూడా వాలంటీర్ల అక్రమాలకు పాల్పడటం వల్లే వైసీపీ విజయం సాధించిందని చెప్పారు. ఇక అచ్చెన్న వ్యాఖ్యలపై విజయ సాయి రెడ్డి తనదైన శైలిలో పంచ్ వేశారు .

బిజెపి చంకలో దూరాలని పచ్చ పార్టీ ఆరాటం, సపోర్ట్ సేన డ్రామా
ఇదిలా ఉంటే టిడిపిని, బిజెపిని టార్గెట్ చేస్తూ తాజా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. ప్రజా విశ్వాసం కోల్పోయిన రెండు పార్టీలు, మద్దతు ఇచ్చేందుకు పుట్టిన సపోర్ట్ సేనల డ్రామా ప్రజలు చూస్తూనే ఉన్నారంటూ బిజెపి, టిడిపి, జనసేన పార్టీ ల పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిజెపి చంకలో దూరాలని పచ్చ పార్టీ ఆరాటం, కానీ వీర్రాజు గారేమో పవనే సీఎం అని తేల్చారు .

బీజేపీ , జనసేన , టీడీపీ .. ట్రయాంగిల్ లవ్ స్టోరీలా లేదు
తనకేమో బాబుని ఇంకోసారి సీఎంగా చూడాలని కోరిక .. ట్రయాంగిల్ లవ్ స్టోరీలా లేదూ అంటూ అటు పవన్ కళ్యాణ్ ను , చంద్రబాబు ను, సోము వీర్రాజు ను టార్గెట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఇక నిన్నటికి నిన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా క్షేత్రస్థాయిలో పనిచేసే వారికే టిడిపి టికెట్ కొత్త రాగం అందుకున్నారు కరకట్ట తండ్రీకొడుకులు అంటూ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగిన విజయసాయిరెడ్డి తాజా పరిణామాల నేపథ్యంలో ఏ చిన్న విషయాన్ని వదలకుండా ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతున్నారు.