హీరోయిన్లతో ఎందుకు, రోడ్డుపై వెళ్తుంటే.. ఢిల్లీలో బాబు పరిస్థితి ఇదీ: విజయసాయి

Recommended Video

    ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తి ఇంతలా దిగజారాలా:విజయ్ సాయి రెడ్డి

    న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ప్రత్యేక హోదా కోసం రాలేదని, మేనేజ్ చేయడానికి వచ్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి బుధవారం అన్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో టీడీపీ ఎంపీలు అందరు జాతీయ నాయకుల వద్దకు వెళ్లి బాబ్బాబు.. మా అధినేతను కలవాలని చెబుతున్నారన్నారు.

    హీరోలు, హీరోయిన్లతో చంద్రబాబు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని, సినిమా షూటింగ్‌కు క్లాప్ కొట్టినట్లు చంద్రబాబు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిస్థాయి వ్యక్తి ఇంతలా దిగజారాలా అన్నారు. నిన్నటి వరకు బీజేపీ, జనసేన చక్రాలు టీడీపీకి ఉండెనని, ఇప్పుడు అవి లేకపోయేసరికి పార్ట్‌నర్ కోసం అర్రులు చాస్తూ, తిరుగుతున్నారన్నారు.

    చంద్రబాబును కలిసేందుకు ఎవరూ ఇష్టపడట్లేదు

    చంద్రబాబును కలిసేందుకు ఎవరూ ఇష్టపడట్లేదు

    చంద్రబాబును కలిసేందుకు ఎవరూ ఇష్టపడటం లేదని విజయ సాయి రెడ్డి చెప్పారు. చంద్రబాబు అంతటా విశ్వసనీయత కోల్పోయారన్నారు. చంద్రబాబు ఢిల్లీలో ఎవరెవరిని కలిశారు, ఎందుకు కలిశారు, ఏయే లావాదేవీలు చేశారో చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు ఫోటో షూట్ కోసమే ఢిల్లీకి వచ్చారని వ్యాఖ్యానించారు. 29సార్లు ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు ఇఫ్పటి వరకు ఏం సాధించారని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ ఎందుకు వచ్చినట్లు అన్నారు.

    రోడ్లపై యూటర్న్ చూస్తుంటే చంద్రబాబు కనిపిస్తున్నారు

    రోడ్లపై యూటర్న్ చూస్తుంటే చంద్రబాబు కనిపిస్తున్నారు

    తనకు గత కొద్ది రోజులుగా రోడ్డుపై ఎక్కడ యూటర్న్ కనిపించినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే కనిపిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అన్నారు. రోడ్లపై ఎక్కడ యూటర్న్ చేయాలో అక్కడ చంద్రబాబు బొమ్మ వేయవచ్చునని ఎద్దేవా చేశారు.

    ఢిల్లీలో చంద్రబాబు పరిస్థితి ఇదీ

    ఢిల్లీలో చంద్రబాబు పరిస్థితి ఇదీ

    ఎవరైనా విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఇడ్లి, వడ అంటూ ఆంధ్రా వంటకాలు అంటుంటారని, సినిమాల వద్ద బ్లాక్ టిక్కెట్లు అమ్మేటప్పుడు పది రూపాయలు వంద రూపాయలు అంటుంటారని.. ఇక్కడ ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు పరిస్థితి అదే అన్నారు. టీడీపీ ఎంపీలు ప్రతి రాజకీయ పార్టీ నేతను కలిసి తమ అధినేతను కలవాలని కోరుతున్నారని చెప్పారు.

    హీరోలు, హీరోయిన్లతో చంద్రబాబు ఫోజులు

    హీరోలు, హీరోయిన్లతో చంద్రబాబు ఫోజులు

    అందర్నీ కలుస్తూ ఫోటో షూట్‌లు చేస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించి విజయసాయి రెడ్డి అన్నారు. హీరోయిన్, హీరోలతో ఫోటోలకు ఫోజులు ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం వచ్చిన చంద్రబాబు బీజేపీ నేతలను కలవడం ఏమిటి అని ప్రశ్నించారు. ఇక్కడకు వచ్చిన చంద్రబాబు హీరోయిన్, హీరోలతో, సినిమా వాళ్లతో ఫోటోలు దిగి ముఖ్యమంత్రి స్థాయి దిగజార్చుతున్నారన్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా ఫోటోలు దిగడం అంటే ఎంత దిగజారుడుతనం అన్నారు.

    రెండు చక్రాలు పోవడంతో పార్ట్‌నర్ కోసం వెతుకులాట

    రెండు చక్రాలు పోవడంతో పార్ట్‌నర్ కోసం వెతుకులాట

    చంద్రబాబుకు గత ఎన్నికల్లో ఓ చక్రం జనసేన అయితే, మరో చక్రం బీజేపీ అన్నారు. గతంలో లెఫ్ట్ పార్టీ చక్రంపై నడిచారన్నారు. ఇప్పుడు ఏ చక్రం లేకపోవడంతో దానిని వెతుక్కునే పనిలో చంద్రబాబు పడ్డారన్నారు. కానీ ఎవరూ ముందుకు వచ్చేలా లేరని, ఆయనను ఎవరూ నమ్మే పరిస్థితి లేరని, ఆయన ఏకాకి అయ్యారన్నారు.

    ఫ్యాన్ గాలి, జగన్ సీఎం

    ఫ్యాన్ గాలి, జగన్ సీఎం

    వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, జగన్ సీఎం అవుతారని, 25 లోకసభ స్థానాల్లో, 175 అసెంబ్లీ స్థానాల్లో 150 స్థానాలు వైసీపీ గెలుస్తుందని విజయ సాయి రెడ్డి చెప్పారు. ఏపీలో ఎప్పటికీ టీడీపీ అధికారంలోకి రాదన్నారు. ఫ్యాన్ గాలి వీస్తోందని చెప్పారు. సభా హక్కుల నోటీసుపై యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+