సాయిరెడ్డి వర్సెస్ మాణిక్యం ఠాగూర్ : రాహుల్ పక్కన ఆమె ఎవరో తెలుసా - జగన్ రెడ్డి కేసుల కోసమే...!!
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేపాల్ లోని నైట్ క్లబ్ లో ఉన్న వీడియో పైన ముదిరిన రాజకీయ వివాదం అనేక మలుపులు తీసుకుంటోంది. రాహుల్ గాంధీ ఖాట్మండులోని ఒక నైట్ క్లబ్ లో ఉండటం..ఆయన తో పాటుగా నేపాల్ లో చైనా రాయబారి హౌ యాంక్వీ ఉండటం పెద్ద వివాదంగా మారింది. దీనిని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అనేక మంది పోస్టింగ్ లు పెడుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో రాహుల్ నైట్ క్లబ్ లకు వెళ్తున్నారంటై సెటైర్లు వేస్తున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీ యూరప్ టూర్ పైన కాంగ్రెస్ నేతలు విమర్శలు చేసారు.
Video of @RahulGandhi partying in a Nepal night club with Chinese diplomats is disturbing as China's honey traps are rising. Hou Yanqi,Chinese Ambassador to Nepal also spotted with him.Congress unnecessarily questions @NarendraModi Ji's Europe trip while its own leader does this!
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 3, 2022
ఇక, రాహల్ నైట్ క్లబ్ కు వెళ్లటం పైన బీజేపీ నేతల విమర్శలకు కాంగ్రెస్ సమాధానం ఇచ్చింది. నేపాల్ లో వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ వెళ్లారని..అది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. అసలు..ఆ వీడియోలో ఏం తప్పు ఉందని నిలదీస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి బీజేపీ నేతల వాయిస్ అందుకున్నారు. నేపాల్ నైట్ క్లబ్ లో రాహుల్ పక్కన ఉంది ఎవరో తెలుసా అంటూ ట్వీట్ చేసారు. నేపాల్ లో చైనా దౌత్యవేత్తగా పని చేస్తున్న హౌ యాంక్వీ అని చెబుతూ..గతంలో ఆమె చేసిన హానీ ట్రాప్ గుర్తుకువస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ యూరప్ పర్యటన పైన కాంగ్రెస్ అవసరం లేని విమర్శలు చేసిందని చెబుతూ..ఇప్పుడు కాంగ్రెస్ నేత వివాదంలో చిక్కుకున్నారంటూ ట్వీట్ చేసారు. దీని పైన కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ స్పందించారు. ఈ వివాదం ప్రారంభమైన వెంటనే ఆయన తొలుత కేంద్ర మాజీ మంత్రి..బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ ఫొటో ఒకటి ట్వీట్ చేస్తూ....ఎవరో తెలుసా అంటూ ప్రశ్నించారు. ఇక, విజయ సాయిరెడ్డి ట్వీట్ కు ఆయన సమాధానం ఇచ్చారు.
Corrupt Vijayasai Reddy Pl see the truth . We know that your problem is the corruption cases against Jagan reddy for that you have to keep sahib happy .But dnt forget the truth. Mr Gandhi went to attend a wedding of the Nepal Ambassador daughter. What’s wrong in attending it ? pic.twitter.com/ueicImqhVY
— Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) May 3, 2022
వాస్తవం ఏంటో చూడాలని సూచిస్తూనే... అవినీతి సాయిరెడ్డి ఇబ్బంది ఏంటో తనకు తెలుసని...జగన్ రెడ్డి పైన కేసుల కారణంగానే సాహిబ్ (ప్రధాని) ని సంతోష పర్చేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ..నేపాల్ రాయబారి కుమర్తె వివాహానికి హాజరయ్యారని..ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. సాయిరెడ్డి ట్వీట్ పైన పలువురు అనుకూలంగా...ప్రతికూలంగా తమ స్పందనలు తెలియచేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం కాంగ్రెస్ వివరణతో ముగుస్తుందా..లేక, కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications